సర్వేంద్రియానాం నయనం(Eyes) ప్రధానం అన్నారు పెద్దలు. మన శరీరంలో అన్ని అవయవాలకంటే కళ్లకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ఎకక్కువ. అటువంటి కళ్లను నిర్లక్ష్యం చేసి.. పట్టించుకోకుండా ఉంటే.. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేదు

కళ్ళు కలకాలం చల్లగా ఉండాలేంటే.. ఏం చేయాలి,,,? కంటి ఆరోగ్యానికి అద్భుతమైన చిట్కాలు..

సర్వేంద్రియానాం నయనం(Eyes) ప్రధానం అన్నారు పెద్దలు. మన శరీరంలో అన్ని అవయవాలకంటే కళ్లకు ఉన్న ప్రాధాన్యత ఎంతో ఎకక్కువ. అటువంటి కళ్లను నిర్లక్ష్యం చేసి.. పట్టించుకోకుండా ఉంటే.. ఆ నష్టాన్ని ఎవరూ పూడ్చలేదు. మనం ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కంటికి కావల్సిన పోషకాలు అందేలా ఆహారం తీసుకుని.. కంటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు.. అవి కలకాలం హయిగా ఉంటాయి.

అంతే కాదు అలాగే, కంటి నరాలపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. మధుమేహం, బీపీ ఉన్న వారు వాటిని నియంత్రణలో పెట్టుకుని, పోషకాహారం(Nutritious food) అందించడం ద్వారా కంటిచూపు(Eye sight) దెబ్బతినకుండా చూసుకోవచ్చు. పోషకాలంటే విటమిన్ ఏ(Vitamin A), ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్(Omega 3 Fatty acids)అందించాలి. మరి కంటి చూపుకు మనం చేయాల్సింది ఏంటీ.. చూద్దాం.

ఫోన్లు(Phones), కంప్యూటర్ల స్క్రీన్లను(Computer screens) గంటల తరబడి చూస్తుంటే కంటికి విశ్రాంతి తగ్గి, నష్టం జరుగుతుంది. కంటి చూపు ఎందుకు తగ్గుతుంది? అనే దానికి వయసు పెరగడం ఒక కారణం అయితే.. పైన చెప్పినవి కూడా మరో కారణం. ఇవి కాకుండా ఒత్తిడి, పోషకాల లేమితోనూ కంటి చూపు మసకబారుతుంది.

నెలలో నాలుగుసార్లు చేపలు తినండి మీ కంటి చూపుకు.. ముందు చూపు మందులాంటిది చేప. కంటికి చేపలు ఎంతో మంచి చేస్తాయి. చేపల్లోనూ సాల్మన్ రకం మంచివి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు. కనుక ఇవి చెడు కొవ్వులను తగ్గిస్తాయి. కళ్లు పొడిబారిపోకుండా, రెటీనాకు మేలు చేస్తాయి.

గుడ్లు ఆరోగ్యానికి మంచివి ముఖ్యంగా కోడి గుడ్లలో విటమన్ ఏ, లూటిన్, జియాక్సాంతిన్, జింక్ ఉంటాయి. విటమిన్ ఏ కంటి కార్నియాకు ఎంతో ఉపయోగపడతాయి. కంటిలో కనిపించే ఉపరితలాన్ని కార్నియా అంటారు.

ఇక కంటిని కాపాడటానికి లూటిన్, జియాక్సాంతిన్ ఎంతో ఉపయోగపడతాయి. అవి కంటికి సమస్యలు రాకుండా రక్షణనిస్తాయి. రెటీనా ఆరోగ్యానికి జింక్ సాయపడుతుంది. లూటిన్, జియాక్సాంతిన్ ను మన శరీరం తయారు చేసుకోలేదు. అందుకే బయట నుంచి సప్లమెంటేషన్ కావాలి. ఇది ఎక్కువగా ఆకుకూరల్లో ఉంటాయి.. ముక్యంగా పాలకూరలోనూ ఇవి లభిస్తాయి.

బాదాంలో .. విటమిన్ ఈ తగినంత ఉంటుంది. ఇది కంటికి రక్షణనిస్తుంది. వయసు మీరడం వల్ల వచ్చే మాక్యులర్ డీజనరేషన్ నుంచి కాపాడుతుంది. అయితే, రోజులో బాదం గింజలను ఎక్కువ కాకుండా తీసుకోవాలి. అంటే ఒకేసారి మితిమీరి తినకూడదు.

ఇవే కాదు క్యారెట్లలోనూ విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. పైన చెప్పుకున్న ప్రయోజనాలకు అదనంగా, ఇన్ఫెక్షన్ల నుంచి కూడా విటమిన్ ఏ రక్షణనిస్తుంది. ఇలా మనం మన ఆహారం ద్వారా కంటిని రక్షించుకోవచ్చు.

Updated On 15 May 2023 11:24 PM GMT
Ehatv

Ehatv

Next Story