అవును మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తికి పురుషాంగం ఉబ్బింది, దానిపై పుండులా ఏర్పడి రక్తస్రావం జరుగుతోంది.
అవును మీరు విన్నది నిజమే. ఓ వ్యక్తికి పురుషాంగం ఉబ్బింది, దానిపై పుండులా ఏర్పడి రక్తస్రావం జరుగుతోంది. దీంతో అతను డాక్టర్‌ను సంప్రదించగా ఆ డాక్టర్ స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు వెళ్లాలని సూచించడంతో అక్కడికి వెళ్లిన రోగికి షాకింగ్ విషయం తెలిసింది. ఇంగ్లాండ్(England)కు చెందిన షాన్ ఎవాన్స్(Sean Evans)కు ఈ చేదు సంఘటన ఎదురైంది. అతని వ్యాధిని నిర్ధారించడానికి, బయాప్సీ(Biopsy) చేయాల్సి వచ్చింది, కానీ షాన్ ఎవాన్స్‌కు చికిత్స చేయడం మరియు బ్లడ్ థిన్నర్లు(Blood Thinners) ఇవ్వడం వలన, అది ఆలస్యం అవుతూ వచ్చింది. ఎవాన్స్ నొప్పి మరియు అసౌకర్యంతో బాధపడ్డాడు. చికిత్స కోసం వెయిట్ చేసినా కానీ నొప్పిని భరించలేకపోయాడు. దీంతో ఆ అవయవాన్ని కత్తిరించడం తప్ప మరో మార్గం లేదని వైద్యులు చెప్పడంతో దానిని కత్తిరించి ఎవాన్స్‌కు చికిత్స అందిస్తున్నారు. పురుషాంగంలో నొప్పి, పురుషాంగం కొన వద్ద వాపు, చర్మం గట్టిపడటం, రంగు మారడం అనేది పురుషాంగ క్యాన్సర్ యొక్క కొన్ని లక్షణాల ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.