మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహానికి గురైనవారు బతికున్నంత కాలం మందులు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహానికి గురైనవారు బతికున్నంత కాలం మందులు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మధుమేహం(Diabetic)తగ్గించుకునేందుకు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. అయితే మధుమేహాన్ని నివారించేందుకు అద్భుతమైన కూరగాయ ఒకటి చక్కని ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య రంగనిపుణులు సూచిస్తున్నారు.

అదే 'సురాన్‌' (Suran)అనే కూరగాయ. కొంతమందికి ఈ కూరగాయ గురించి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు, మరికొందరు దాని పేరును మొదటిసారి వినవచ్చు. శాస్త్రీయంగా అమోర్ఫోఫాలస్ పెయోనిఫోలియస్ (Amorphophallus)అని పిలుస్తారు, సురాన్ ఒక విచిత్రమైన రూపాన్ని కలిగి ఉంటుంది. దీంతో కొంతమంది తినడానికి ఇష్టపడరు. కానీ మధుమేహ రోగులకు(Diabetic Patients),ఈ కూరగాయ ఒక అద్భుతమని సూచిస్తున్నారు. అనేక ఆసియా దేశాలలో సురాన్ కూరగాయను రెగ్యులర్‌గా తింటారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కేలరీలు( Calories), కార్బోహైడ్రేట్లు(Carbohydrates),ప్రొటీన్లు(protines),పొటాషియం(potassium), ఫైబర్‌(fibar)ఇందులో ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ B6, విటమిన్ B1, రిబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ A, బీటా-కెరోటిన్‌లను సురాన్‌ కలిగి ఉంటుంది.

డయాబెటిస్ రోగులకు సురాన్ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో కూడా తెలిపారు. సురాన్‌లో అల్లాంటోయిన్ అనే రసాయన సమ్మేళనం ఉంది, ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది మలబద్ధకం, కొలెస్ట్రాల్, దగ్గు, పైల్స్, ఆస్తమా వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. సురాన్‌లో ఉండే మూలకాలు గ్లూకోజ్‌ని నియంత్రించడంలో సహాయపడతాయి.

ehatv

ehatv

Next Story