మనిషికి తిండికంటే కూడా నిద్ర చాలా ముఖ్యం.

మనిషికి తిండికంటే కూడా నిద్ర చాలా ముఖ్యం. సరైన ఆరోగ్యకరమైన నిద్ర.. మనిషి ఆయుష్షును పెంచుతుంది. కాని ఆధునిక జీవనశైలి , ఫోన్ లాంటి సాంకేతిక సౌకర్యాలు మన నిద్ర విధానాలను సమూలంగా మార్చేశాయి. బిజీ షెడ్యూల్స్ కారణంగా, చాలామంది అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతున్నారు. అంతే కాదు కొంత మంది తరచు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల వరకు మెలకువగా ఉండటం.. ఫోన్ లు చూసుకుంటూ టైమ్ ను గడిపేయడం లాంటివి చేస్తున్నారు.

మరికొంతమంది మాత్రం ఎక్కువగా నైట్ షిప్ట్ లు చేయడం..ఆలస్యంగా పని చేయడం, ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించడం లేదా బెడ్‌పైకి ఎక్కి.. పడుకోకుండా అలా ఏదో ఒక సినిమానో..టీవీసిరిస్ లో పెట్టుకుని.. చూడటంతో రాత్రినిద్ర టైమ్ ను వేస్ట్ చేస్తూ.. ఆలస్యంగా నిద్రపోవడం జరుగుతుంది. దీన్నే నిద్ర టైమ్ ను వాయిదా వేయడం అని పిలుస్తారు, ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే హానికరమైన అలవాటు.

నిద్ర ఆలస్యం కావడం వల్ల శరీరం యొక్క సహజ సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగించి, ఆరోగ్యానికి వ్యతిరేక ప్రభావాలను కలిగిస్తుంది. ఇది ఇలానే కొనసాగితే లాంగ్ రన్ లో జీర్ణ సమస్యలు, టెన్షన్, డిప్రెషన్, ఒత్తిడి , మానసిక సమస్యలు ఎక్కువై.. లైఫ్ టైమ్ తగ్గిపోతుంది. అనేక సమస్యలకు దారితీస్తుంది.

చాలా ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీస్తుంది దీనివల్ల జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతే కాదు ముందు ముందు మైండ్ పై కూడా ప్రభావం పడి.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇది మనలో చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అంతే కాదు ఇది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందంటే.. బరువు పెరిగి ఒబెసిటీకి దారితీస్తుంది. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.

ehatv

ehatv

Next Story