Cholera Outbreak : కలరా విజృంభణ.. 400 దాటిన మృతుల సంఖ్య..
ఆఫ్రికా(Africa) దేశం జాంబియాలో(Zambia) కలరా(Cholera outbreak) విజృంభిస్తోంది. కలరా వ్యాప్తి పెరగడంతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఆ దేశంలో 10 వేల మందికిపైగా కలరా వ్యాప్తి చెందింది. తాజాగా కలరా వల్ల జాంబియాలో 400 దాటింది. కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తమైంది. గతేడాది అక్టోబర్ నెలలో జాంబియాలో కలరా వ్యాప్తి చెందింది. జాంబియాలోని సగం జిల్లాలు, 10 ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరా వ్యాప్తి చెందినట్లు నిర్ధారణైంది.
ఆఫ్రికా(Africa) దేశం జాంబియాలో(Zambia) కలరా(Cholera outbreak) విజృంభిస్తోంది. కలరా వ్యాప్తి పెరగడంతో ప్రజల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఆ దేశంలో 10 వేల మందికిపైగా కలరా వ్యాప్తి చెందింది. తాజాగా కలరా వల్ల జాంబియాలో 400 దాటింది. కరోనా కట్టడికి ప్రభుత్వం అప్రమత్తమైంది. గతేడాది అక్టోబర్ నెలలో జాంబియాలో కలరా వ్యాప్తి చెందింది. జాంబియాలోని సగం జిల్లాలు, 10 ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరా వ్యాప్తి చెందినట్లు నిర్ధారణైంది. 2 కోట్ల జనాభా ఉన్న జాంబియాలో రోజుకు 400 కంటే ఎక్కువ కలరా కేసులు నమోదవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కలరాను అరికట్టేందుకు టీకా కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. 60 వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ఫుట్‌బాల్ స్టేడియాన్ని జాంబియా ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి జాంబియాకు దాదాపుగా 14 లక్షల కలరా డోసుల వ్యాక్సిన్(vaccine) అందింది. త్వరలోనే మరో 2 లక్షల డోసులు వస్తాయని జాంబియా అధికారులు చెప్తున్నారు. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. గత కొన్ని దశాబ్దాల్లో 2023లోనే మలావీ దేశంలో అతి తీవ్రమైన కలరా వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నైజీరియా, ఉగాండా దేశాలతో పాటు మరో 30 దేశాలు గత కొన్ని ఏళ్లుగా విజృంభణ జరుగుతోంది.