అందానికి.. ఆరోగ్యానికి మన వంటింట్లో ఉండే పసుపు(Turmeric) బాగా ఉపయోగపడుతుంది. మనిషి జీవితానికి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తివంతమైన దినుసు పసుపు. పసుపుని హిందూవులు పవిత్ర పదార్దంగా చూస్తారు. చాలా మంది యాంటీ బయోటిక్ గా చూస్తారు.

అందానికి.. ఆరోగ్యానికి మన వంటింట్లో ఉండే పసుపు(Turmeric) బాగా ఉపయోగపడుతుంది. మనిషి జీవితానికి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తివంతమైన దినుసు పసుపు. పసుపుని హిందూవులు పవిత్ర పదార్దంగా చూస్తారు. చాలా మంది యాంటీ బయోటిక్ గా చూస్తారు.

అనేక ఆరోగ్య(health), సౌందర్య(bueaty) గుణాలు కలిగిన పసుపు.. ఆరోగ్య, సౌందర్య పోషణలలోనూ ఇది ధీటుగా పనిచేస్తుందని నిపుణులు అంటారు. స్త్రీలకి(women), పసుపుకి చాలా అనుబంధం ఉంది. స్త్రీలు చాలా రకాలుగా పసుపును పవిత్రంగా వాడుతారు. అంతే కాదు కిచెన్ లో పసుపుకు ఉన్న చోటు.. చాలా ఉన్నతమైనది.

ఇక పసుపులోఉన్న మెడిసిన్(Medicine) గుణాలు..సైంటిఫిక్ గా చెప్పుకోవాలి అంటే... విటమిన్లు(vitamins), లవణాలతోపాటు శరీరారోగ్యానికి తోడ్పడే పైటిన్ ఫాస్పరస్ కూడా అధికంగా ఉంటుంది పసుపులో.

పసుపులో జీవన క్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్(biotic), క్యాన్సర్ నిరోధక(Cancer), ఇన్ఫ్లమేషన్నిరోధించేవి, ట్యూమర్(Tumor) కలుగకుండా వుండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్న వందలాపరమాణువులున్నాయి.

పసుపులోని మెడిసిన్ గుణం చర్మం(Skin), గుండె(heart), కాలేయం(liver), ఊపిరితిత్తులు(lungs) లాంటి మన శరీరంలోని అవయవాల చికిత్సకు బాగా పనిచేస్తుందని నిరూపితం అయ్యింది. మన పూర్వికులు కూడా అదే చెప్పారుమరి.

చర్మవ్యాధులు, శరీర పగుళ్లు కాలిన, కమిలిన గాయాలకు, మోటిమలు, మచ్చలు, కురుపులకు లాంటి ఎన్నో చర్మ వ్యాధుల చికిత్సలో పసుపు కీలకంగా పనిచేస్తుంది. అంతెందుకు ఎవరికైనా దెబ్బ తగిలితే.. వెంటనే పసుపు పెడుతుంటారుకదా..?

పసుపు ను ఎన్ని రకాలుగా వాడవచ్చు అంటే..? వేడిపాలలో పసుపును కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మంచిదని అప్పటి వారు చెపుతుంటారు. చాలా మంది తాగుతుంటారు కూడా.

దెబ్బలు తగిలిన గాయాలకు, దీర్ఘకాలంగా ఉన్న పుండ్లుపై పసుపు అద్దడం వలన సెప్టిక్ కాకుండ త్వరగా తగ్గిస్తుంది అంతే కాదు అరికాల్ల పగుళ్లకు పసుపు బగాగా పనిచేస్తుంది. కాళ్ళకు పూసినట్లయితే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి.

బాగా కాచిన వేడి నీటిలో కొంచెం పసుపు వేసి ఆవిరి పడితే ముఖంపై ఉన్న క్రిములు పోవడమే కాకుండా గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, జలుబు వంటి వ్యాధులు మటుమాయం అవుతాయి.

పసుపును పెరుగులో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి. పసుపు, సైందవలవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది. ఇలా పసుపు వాడడం వలన రక్తపోటు, మధుమేహంను అదుపులో ఉంచుతుంది.

వేపనూనె, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్న చోట రాస్తే చర్మవ్యాధులను నయం చేస్తుంది. ముఖ్యంగా చికెన్ ఫాక్స్,ఆటలమ్మ వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనం ఉంటుంది.పసుపు, చందన పొడి, రోజ్వటర్తో కలిపి ఫేస్ట్ చేసి ముఖానికి పూసి, కొంతసేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్, మచ్చలు తగ్గుతాయి. ఇలా పసుపు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

Updated On 1 May 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story