Thailand Air Pollution:వాయుకాలుష్యంతో 13 లక్షల మందికి అస్వస్థత .!
ప్రస్తుతం థాయ్ దేశంలో వాయు కాలుష్యంప్రమాణాలను దాటిపోయిన స్థాయి చేరుకుందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) .దీనితో అక్కడి ప్రజలను సాధ్యమైనంతవరకు బయటకు రావద్దని సూచించింది . N 95 మాస్క్ లను తప్పనిసరి చేసింది.
గతవారం రోజులుగా తీవ్ర వాయుకాలుష్యం కారణంగా థాయిలాండ్ ప్రజలు తీవ్ర అస్వస్థత కు గురి అవుతున్నారు . రోజు రోజు కి తగ్గుతున్న గాలి నాణ్యత వలన అక్కడ ప్రజలు అనేక అనారోగ్యసమస్యలు ఎదుర్కుంటున్నారు. దేశంలో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురైన సమాచారం . రెండులక్షల మంది కి పైగా ఆసుపత్రి పాలు అయినట్లు ద్రువీకరిస్తుంది అక్కడి ప్రభుత్వం .
పరిశ్రమలు విడుదలచేసే కర్బన వ్యర్దాలు, పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వెలువడే పొగ ,వాహన కాలుష్యం కారణంగా థాయ్ రాజధాని బ్యాంకాక్(Bangkok)లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. "గత మూడు రోజులుగా బ్యాంకాక్‌లో 50 జిల్లాల్లో పీఎం 2.5 స్థాయిలు పడిపోయాయి . ఇది మానవ ఆరోగ్యం పైన తీవ్ర దుష్పరిణామాలు చూపిస్తుంది .గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళి కణాలు మనిషి రక్తంలో కలిసిపోయి శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని థాయ్ ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.
ప్రస్తుతం థాయ్ దేశంలో వాయు కాలుష్యంప్రమాణాలను దాటిపోయిన స్థాయి చేరుకుందని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) .దీనితో అక్కడి ప్రజలను సాధ్యమైనంతవరకు బయటకు రావద్దని సూచించింది . N 95 మాస్క్ లను తప్పనిసరి చేసింది. ఉద్యోగస్తులు ఇంటి దగ్గర నుండే పని చేయాలనీ ఆదేశించింది. పాఠశాలలతోపాటు, పార్క్‌లు వంటి చోట్ల నో డస్ట్ రూమ్ (No Dust Room) పేరుతో ఎయిర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసినట్లు థాయ్ ఆరోగ్య శాఖ తెలిపింది.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా వారిని ఎక్కువ సమయం బయటకు పంపొద్దని తల్లిదండ్రులను ఆదేశించటం జరిగింది.