గతి కొద్దీ రోజుల క్రితం అకాల వర్షాలకు చల్లబడిన'వాతావరణంతో సేద తీరుతున్న ప్రజలు ఇప్పుడు గుబులు పుట్టిస్తున్న ఎండతీవ్రతను ఎదుర్కొంటున్నారు . ఈ సంవత్సరం గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ రాజధాని నగరం(Telangana Capital city ) హైదరాబాద్ (Hyderabad )వేసవి వేడిని చూసే అవకాశం ఉంటుందని తెలిపిందని వాతావరణ శాఖ .ఇప్పటికి సరైన వేడి మొదలుకానప్పటికీ రాబోయేకాలంలో మాత్రం ఎండలు దంచికొడతాయి అని హెచ్చరిస్తున్నారు .
గతి కొద్ది రోజుల క్రితం అకాల వర్షాలకు చల్లబడిన'వాతావరణంతో సేద తీరుతున్న ప్రజలు ఇప్పుడు గుబులు పుట్టిస్తున్న ఎండ తీవ్రతను ఎదుర్కొంటున్నారు . ఈ సంవత్సరం గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ రాజధాని నగరం(Telangana Capital city ) హైదరాబాద్ (Hyderabad )వేసవి వేడిని చూసే అవకాశం ఉంటుందని తెలిపిందని వాతావరణ శాఖ .ఇప్పటికి సరైన వేడి మొదలుకానప్పటికీ రాబోయేకాలంలో మాత్రం ఎండలు దంచికొడతాయి అని హెచ్చరిస్తున్నారు .
భారత వాతావరణ శాఖ (IMD) ఈ సీజన్‌లోని మొదటి వేడి తరంగం త్వరలో రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లోని(Hyderabad ) వాతావరణ శాఖ ప్రాంతీయ కేంద్రం ప్రకారం, తెలంగాణలోని రాజధానితో సహా అనేక ప్రాంతాలు ఏప్రిల్ (April )రెండవ వారం నుండి అధిక ఉష్ణోగ్రతలు( High Temperatures ), వేడిగాలులను తీవ్రతను ఎదుర్కొంటాయి అని చెప్పింది . వేడిగాలుల సమయంలో రాష్ట్రంలో 40-43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వాతావరణ తాజా సమాచారం ప్రకారం, ఈ వేసవి కాలంలో తీవ్రమైన వేడి తరంగాలతో సంబంధం ఉన్న ఎల్ నినో (El Nino) వాతావరణ నమూనా ఉద్భవించే అవకాశం ఉంది. ఎల్‌నినో(El Nino) ప్రారంభమైతే వేసవి మరింత వేడిగా ఉంటుందని, కరువు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని ఐఎండీ (IMD) చీఫ్ నాగరత్న వివరించారు.
మే నెలలో వేసవి తాపం పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు(Temparatures) 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు
అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ వేసివిలో మనం ఏమి చేయాలో ఏమి చెయ్యకుండా లాంటి జాబితాను IMD నివేదించింది అవి ఏంటంటే . !
వేసవిలో ప్రతి ఒక్కరు తగినంత నీరు త్రాగాలి - దాహం వేసిన వేయకపోయినా తప్పనిసరిగా నీరు తాగాలి '.
మూర్ఛ లేదా గుండె, మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి(Liver diease) ఉన్న వారు లిక్విడ్ -నియంత్రిత( Liqid -controlled ) ఆహారంలో ఉన్నవారు నీటిని తీసుకోవడం పెంచే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన లస్సీ, గంజి (బియ్యం నీరు), నిమ్మ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైన వాటిని తీసుకోవాలి
.
తేలికైన, లేత రంగు, వదులుగా, కాటన్ దుస్తులను(Cotton Clothes ) ధరించండి.
వృద్ధులు, పిల్లలు, అనారోగ్యం లేదా అధిక బరువు ఉన్నవారు అధిక వేడికి గురయ్యే అవకాశం ఉన్నందున వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తోపాటు అధిక జాగ్రత్త కూడా అవసరం .
చేయకూడని పనులేంటో తెలుసు కుందాం :
ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లడం మంచిది ఏ మాత్రం కాదు .
మధ్యాహ్నం బయట ఉన్నప్పుడు కఠినమైన పనులకు దూరంగా ఉండండి.
వంట ప్రదేశాన్ని తగినంతగా వెంటిలేట్ చేయడానికి తలుపులు మరియు కిటికీలను తెరవండి.
శరీరాన్ని డీహైడ్రేట్(Dehydrate ) చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలకు దూరంగా ఉండండి.
అధిక ప్రోటీన్, సాల్ట్ , కారం ఇంకా నూనెతో కూడిన ఆహారాన్ని నివారించండి.నిల్వ ఆహారం తినకూడదు.
పార్క్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను ఒంటరిగా ఉంచకండి.
కంప్యూటర్లు(Computers ) లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు( Electronic Goods )వంటి అనవసరమైన వేడిని ఉత్పత్తి చేసే పరికరాలను ఉపయోగించనపుడు జాగ్రత్తలు వహించటం మర్చిపోకండి .
వేసవి ఎండలు (Summer )మార్చి చివరి నుండి జూన్ వరకు కొనసాగుతాయి ఈ సమయంలో, ఉష్ణోగ్రతలు 45-46 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి,తగినన్ని జాగ్రత్తలతో ఈ వేసవిని మరింత జాగ్రత్తలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వాతావరణ శాఖ సూచింది .