భవిష్యత్‌ తెలంగాణ(Telangana) భయపెడుతోంది. కరువు తరముకొస్తున్నది. వేసవి రాకమునుపే గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నది. గొంతు తడుపుకోవడం కోసం అలమటించాల్సి వస్తున్నది. ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోయాయి. మిషన్‌ భగీరథ(Mission bhagiratha) రిజర్వాయర్ల పరిస్థితి మరింత దారుణం. ఏప్రిల్‌ మాసం రాకముందే డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు(Ground Water) గణనీయంగా పడిపోయాయి. రాబోయే రెండు నెలలు గడవడం ఎలా అన్నది తల్చుకుంటేనే భయం కలుగుతోంది. సాగునీరు ఎలాగూ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిసిపోయింది.

భవిష్యత్‌ తెలంగాణ(Telangana) భయపెడుతోంది. కరువు తరముకొస్తున్నది. వేసవి రాకమునుపే గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడవాల్సి వస్తున్నది. గొంతు తడుపుకోవడం కోసం అలమటించాల్సి వస్తున్నది. ప్రధాన రిజర్వాయర్లు ఎండిపోయాయి. మిషన్‌ భగీరథ(Mission bhagiratha) రిజర్వాయర్ల పరిస్థితి మరింత దారుణం. ఏప్రిల్‌ మాసం రాకముందే డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. భూగర్భజలాలు(Ground Water) గణనీయంగా పడిపోయాయి. రాబోయే రెండు నెలలు గడవడం ఎలా అన్నది తల్చుకుంటేనే భయం కలుగుతోంది. సాగునీరు ఎలాగూ ప్రభుత్వం ఇవ్వలేదని తెలిసిపోయింది. తాగునీటికి కూడా అల్లాడిపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రాజెక్టులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. గత నెల 21వ తేదీ నాటికి 34 టీఎంసీలు ఉండటే ప్రస్తుతం 17.88 టీఎంసీ నిల్వలే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టు లెవల్‌ 324 మీటర్లుగా ఉంది. ఏప్రిల్ మొదటి వారం వరకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంది. కాని అది జరిగే పనిలా కనిపించడం లేదు. ఎందుకంటే అప్పటికే ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరుకుంటుంది కాబట్టి. వేసవి తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నుంచే నీటిని విడుదల చేయాలి. ప్రతి నెలా అర టీఎంసీ నీళ్లు అవసరం. కరీంనగర్‌ నగరానికి ప్రధాన తాగునీటి వనరైన ఎల్‌ఎండీలో పరిస్థితి తల్చుకుంటే వెన్నులో వణుకు మొదలవుతున్నది. నెల కిందటే ఈ ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరకున్నది. 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్‌ఎండీ నిరుడు మార్చిలో 12.50 టీఎంసీ లు ఉండగా, ప్రస్తుతం 5.31 టీఎంసీలే ఉన్నా యి. ఈ రిజర్వాయర్‌కు మిడ్‌మానేరు నుంచి 1,467 క్యూసెకుల నీరు వస్తుంది. ఇక్కడి నుంచి కాకతీయ కెనాల్‌ ద్వారా 3,125 క్యూసెకులను సాగు నీటి అవసరాల కోసం దిగువకు విడుదల చేస్తున్నారు. ఏప్రిల్‌ మొద టి వారం వరకు సాగునీటి విడుదల కొనసాగనున్నది. మొత్తంగా ఎల్‌ఎండీలో మరో రెండు టీఎంసీల మేర నిల్వలు తగ్గిపోనున్నాయి. వివిధ ప్రాజెక్టుల్లో భాగమైన పలు రిజర్వాయర్లను మిషన్‌భగీరథ పథకానికి గత ప్రభు త్వం అనుసంధానించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన రిజర్వాయర్లన్నీ ఇప్పటికే ఎండిపోయాయి. నాగార్జునసాగర్‌ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. కృష్ణా ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. గోదావరి బేసి అడుగంటుతున్నది. వేసవికి ముందే రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజల మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇంతటి దయనీయమైన పరిస్థితులు మునుపెన్నడూ లేవు.

Updated On 26 March 2024 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story