తెలంగాణలో(Telangana) కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1(Corona JN-1) కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసులు(Positive Cases) క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్‌గా కరీంనగర్(Karimnagar), మహబూబ్‌నగర్(Mahaboobnagar) జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

TS Corona Cases
తెలంగాణలో(Telangana) కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1(Corona JN-1) కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసులు(Positive Cases) క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లేటెస్ట్‌గా కరీంనగర్(Karimnagar), మహబూబ్‌నగర్(Mahaboobnagar) జిల్లాలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్‌టిపీసీఆర్ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్య అధికారులు తెలిపారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త వేరియంట్ జేఎన్-1 పట్ల నిర్లక్ష్యం పనికిరాదని, కరోనా నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కూడా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 312 కేసులు బయటపడ్డాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలోనే ఉండటం గమనార్హం.
