మహబూబ్‌నగర్‌లోని(Mahaboobnagar) ఎస్‌వీఎస్‌ ఆస్పత్రి(SVS Hospital) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 10 నెలల పసిపాప ఊపిరితిత్తుల(Lungs) నుంచి విరిగిన గాజు ముక్కను విజయవంతంగా బయటకు తీశారు. 30 జనవరి 2024న కర్నూలులోని(Kurnool) ఇంట్లో ఆడుకుంటూ 10 నెలల పాప ప్రమాదవశాత్తూ విరిగిన గాజు ముక్కను మింగింది. దీంతో శిశువుకు దగ్గు వచ్చింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే తమ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఛాతీ ఎక్స్‌రే చేయగా ఎడమ ప్రధాన శ్వాసనాళంలో గాజు ముక్క కనిపించింది.

మహబూబ్‌నగర్‌లోని(Mahaboobnagar) ఎస్‌వీఎస్‌ ఆస్పత్రి(SVS Hospital) వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. 10 నెలల పసిపాప ఊపిరితిత్తుల(Lungs) నుంచి విరిగిన గాజు ముక్కను విజయవంతంగా బయటకు తీశారు. 30 జనవరి 2024న కర్నూలులోని(Kurnool) ఇంట్లో ఆడుకుంటూ 10 నెలల పాప ప్రమాదవశాత్తూ విరిగిన గాజు ముక్కను మింగింది. దీంతో శిశువుకు దగ్గు వచ్చింది. దీనిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే తమ సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ ఛాతీ ఎక్స్‌రే చేయగా ఎడమ ప్రధాన శ్వాసనాళంలో గాజు ముక్క కనిపించింది. దీనిని తొలగించే ప్రయత్నం చేసినా విజయవంతం కాలేదు. దీంతో పాపను కర్నూలులోని మరో ఆస్పత్రికి తరలించారు. రెండోసారి కూడా గాజు ముక్క తొలగించే ప్రయత్నం చేసినా మళ్లీ విఫలమైంది. మూడో సారి కూడా దానిని తొలగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పుడు శిశువును హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు ఎస్‌వీఎస్‌ ఆస్పత్రిలోని(SVS Hospital) పల్మోనాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డిని సంప్రదించారు.

అక్కడ పాపకు గాజు ముక్క ఎక్కడ ఉందో కచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోడానికి సీటీ స్కాన్‌ చేశారు. దాని తర్వాత తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రిజిడ్ బ్రాంకోస్కోపిక్ రీట్రీవల్ ఆఫ్ ఫోర్జిన్ వంటి అత్యాధునిక పరికరాలతో ప్రయత్నించారు. 2 గంటల పాటు శ్రమించి డాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి గాజుముక్కను బయటకు తీశారు.

ఈ అరుదైన శస్త్ర చికిత్సలో పాల్గొన్నవారిలో పల్మనాలజీ ప్రొఫెసర్ డాక్టర్ టి.వెంకటేశ్వర రెడ్డి(Dr. venkateshwar reddy), డాక్టర్ పి.రామకృష్ణ- డిపార్ట్‌మెంట్ అనస్థీషియా హెచ్‌ఓడి, డాక్టర్ అయతుల్లా- అనస్థీషియా ప్రొఫెసర్‌ ఉన్నారు. అంతేకాకుండా డాక్టర్ విజయానంద్- యూరాలజీ ప్రొఫెసర్, డా. సోరెన్ ప్రొఫెసర్ & పీడియాట్రిక్స్ HOD, డాక్టర్ వెంకట్రమణారెడ్డి పీడియాట్రిక్స్ ప్రొఫెసర్, డాక్టర్ శరత్- పల్మోనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ దీప్తి పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్. డాక్టర్ సిద్ధిక్- పల్మనాలజీ సీనియర్ రెసిడెంట్, రెసిడెంట్లు డాక్టర్ గ్రేస్, డాక్టర్ సుమ, డాక్టర్ అనుదీప్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ స్నిగ్ధ, డాక్టర్ శరణ్య, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ సుమయ్య, డాక్టర్ విట్టల్, డాక్టర్ ఉమ, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సంధ్య, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ నూర్, డాక్టర్ జెమీమా, డాక్టర్ సుప్రియ ఉన్నారు.

అరుదైన శస్త్రచికిత్స చేసి చిన్నారి ఊపిరితిత్తుల నుంచి గాజు ముక్కను వెలికితీయడంలో కీలక పాత్ర పోషించిన వైద్య బృందాన్ని ఎస్‌వీఎస్‌ మెడికల్ కాలేజ్‌ యాజమాన్యం అభినందించింది.

Updated On 9 Feb 2024 5:36 AM GMT
Ehatv

Ehatv

Next Story