ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగ భగ మని చండ ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నారు. ఈ టైమ్ లో వడదెబ్బ తగిలిందంటే.. ఆ నరకం మామూలుగా ఉండదు. అందరూ జాగ్రతగ్గా ఉండాలి. అసలు వడదెబ్బ తగలకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ తగిలితే.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో తెలియదు. ఏదో నీరసంగా ఉందిలే కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనుకుంటారు.
ఎండలు మండిపోతున్నాయి. భానుడు భగ భగ మని చండ ప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నారు. ఈ టైమ్ లో వడదెబ్బ తగిలిందంటే.. ఆ నరకం మామూలుగా ఉండదు. అందరూ జాగ్రతగ్గా ఉండాలి. అసలు వడదెబ్బ తగలకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ తగిలితే.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం.
రాత్రి - పగలు తేడా లేకుండా ఉక్కపోత పెరిగిపోతోంది. వడదెబ్బ ఎండలోకి వెళ్తేనే తగులుతుంది అని లేదు. ఇంట్లో ఉన్నా.. వేడి బాగా ఎక్కువగా ఉంటే చాలు.. వడదెబ్బ గట్టిగా తగులుతుంది. అయితే ఇది ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. దాని లక్షణాలు కనిపించినా.. వాటి గురించి తెలియదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తుంటారు.
చాలా మందికి వడదెబ్బ అంటే ఏంటో తెలియదు. ఏదో నీరసంగా ఉందిలే కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనుకుంటారు. అదే వారు చేసే పొరపాటు. వడదెబ్బ తగిలితే.. అలా వదిలేయకుండా.. కొన్ని జాగ్రతత్తలు తీసుకుంటే.. ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఉంటుంది. అసలు వడదెబ్బ లక్షణాలేంటి ? వడదెబ్బ తగిలిన వారు ఎలా ఉంటారు ?
వడదెబ్బకు గురైన వారికి 102 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే తక్కువ జ్వరం, వాపు, మూర్చ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా అలసట, వికారం, తలనొప్పి, వాంతులు, కండరాల్లో తిమ్మిరి, అధికంగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి.
వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లనిగాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. అలాగే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు నీళ్లు, ఓఆర్ఎస్ తాగించాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
ఈలోపు తడిగుడ్డతో తుడవడం.. నీరు తాగించడం.. గాలి తగిలేలా చేయడం లాంటి ప్రథమ చికిత్సా మార్గాలు ఉపయోగించాలి. కాస్త కోలుకున్నాడు అనుకున్న తరువాత వెంటనే హస్పిటల్ కు చేర్చాలి. వడదెబ్బ ప్రభావం వారం పదిరోజులు ఉంటుంది. అప్పటి వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలి.
అసలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తగిలేలోపే సమ్మర్ అంతా కొన్ని నియమాలు పాటిస్తే.. వడదెబ్బ తగలకుండా బయట పడవచ్చు. మరి దానికి ఏం చేయాలో.. కూడా వివరాలు ఇతర ఆర్టికల్స్ లో అందించాం.. చదివి జాగ్రత్తలు పాటించండి.