వేసవి కాలం వచ్చింది అంటే చాలు . ఇక మండే ఎండలకు ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే భయం . .. బయటకెళితే వడదెబ్బ బెడద, ఉక్కపోత డీహైడ్రేషన్ రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి . పెద్దవాళ్ళు ఈ సమ్మర్ జాగ్రత్తలు పాటిస్తూ వేసవి సమస్యల నుంచి ఎలాగోల గట్టెక్కవచ్చు .. వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. ఎక్కువగా ఆడుతు ఉ౦డటం వల్ల వారిలోని […]
వేసవి కాలం వచ్చింది అంటే చాలు . ఇక మండే ఎండలకు ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టాలంటే భయం . .. బయటకెళితే వడదెబ్బ బెడద, ఉక్కపోత డీహైడ్రేషన్ రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి . పెద్దవాళ్ళు ఈ సమ్మర్ జాగ్రత్తలు పాటిస్తూ వేసవి సమస్యల నుంచి ఎలాగోల గట్టెక్కవచ్చు ..
వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. ఎక్కువగా ఆడుతు ఉ౦డటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. ఈ సీజన్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతాం. . కానీ... పిల్లలు ఎండలో ఆడుకుంటూ ఆ విషయమే మర్చిపోతారు. కొందరు పనులపై బయటికి వెళ్లినప్పుడు కుదరక నీళ్లు తాగలేరు. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య బాధిస్తుంది. ఇక చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి పరిస్థితి వేరేలా ఉంటుంది. అందుకే సమ్మర్ వచ్చింది అంటే చాలు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రుల ఆందోళన మొదలవుతుంది . అయితే వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వారు తినే ఆహారంలో కొన్ని పండ్లను చేరిస్తే.. ఈ సమ్మర్ సీజన్లో ఆరోగ్య౦గా ఉండవచ్చు అంటున్నారు .
ఈ సమ్మర్ లో పసిపిల్లలకు ఎక్కువగా పెరుగు అన్నం పెట్టాలి . ఇది మంచి ప్రోబయోటిక్. దీనివల్ల పిల్లలకు ఉదర సమస్యలు లేకుండా చేస్తుంది. అసిడిటీ, డయేరియా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లస్సీ, మజ్జిగ, పెరుగు అన్నం, పండ్ల రసాలతో కలిపి ఇవ్వవచ్చు. శరీరంలో వేడిని తొలగించేందుకు బార్లీ విత్తనాలు అద్భుత0గా పనిచేస్తాయి . ఇందులో ఉండే ఫైబర్ పేగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. బార్లీ నీరు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బార్లీ గంజి, బార్లీ సూప్ పసిపిల్లలకు ఎక్కువగా ఇస్తూ ఉండాలి .
వేసవిలో పిల్లలకు ఉత్తమమైనది కొబ్బరి నీరు . ఇది సులభంగా జీర్ణమవుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అనేక పోషకాలతో పాటు, ఎలక్ట్రోలైట్స్ కూడా కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్ల రుచి బాగుంటుంది కాబట్టి.. పిల్లలు కూడా దీనిని ఇష్టపడి తాగుతారు. వేసవిలో మలబద్ధకం సమస్య పిల్లలను వేధిస్తుంటుంది. ఇలాంటి సమస్యలను తొలగించడంలో బొప్పాయి అద్భుతంగా పని చేస్తుంది. పిల్లలకు రోజూ కొంత బొప్పాయి పండును తినిపిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. పెద్దలు కూడా దీనిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.