వేసవి కాలంలో(Summer) శరీరంలో నీటి శాతం తగ్గతుంది . ఈ సీజన్‌లో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే, ఇది కాకుండా, ఈ సీజన్‌లో చాలా రకాల పండ్లు కూడా వస్తాయి, ఇవి ఈ సీజన్‌లో డీహైడ్రేషన్ నుండి మనల్ని రక్షిస్తాయి . వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డిహైడ్రాట్ అవ్వకుండా ఉంటుంది అదే సమయంలో వేసవిలో వచ్చే అనేక వ్యాధుల నుండి రక్షించడంలో కూడా ఈ పండ్లు మనకు సహాయపడతాయి. ఈ సీజన్‌లో అలసట మరియు నీరసాన్ని తట్టుకోవటానికి ఈ పండ్లు (fruits)మనకు సహాయపడతాయి. కాబట్టి వేసవిలో ఏ పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకుందాం

వేసవి కాలంలో(Summer) శరీరంలో నీటి శాతం తగ్గతుంది . ఈ సీజన్‌లో లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. అయితే, ఇది కాకుండా, ఈ సీజన్‌లో చాలా రకాల పండ్లు కూడా వస్తాయి, ఇవి ఈ సీజన్‌లో డీహైడ్రేషన్ నుండి మనల్ని రక్షిస్తాయి . వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో డిహైడ్రాట్ అవ్వకుండా ఉంటుంది అదే సమయంలో వేసవిలో వచ్చే అనేక వ్యాధుల నుండి రక్షించడంలో కూడా ఈ పండ్లు మనకు సహాయపడతాయి. ఈ సీజన్‌లో అలసట మరియు నీరసాన్ని తట్టుకోవటానికి ఈ పండ్లు (fruits)మనకు సహాయపడతాయి. కాబట్టి వేసవిలో ఏ పండ్లను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

పైనాపిల్(pineapple)
పైనాపిల్ పుల్లని తీపి కలగలిపిన జ్యుసి పండు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది, ఇది సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది ఈ పండులో ఉండే గుణాలు ఎముకలకు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థకు ఉపయోగపడతాయి. అందుకే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే పైనాపిల్ తినండి.

పుచ్చకాయ(Water melon)
ఎండా వలన వచ్చే వేడి గాలులను అధిగమించడానికి, పుచ్చకాయ చాలా ఉపయోగపడుతుంది . ఇది ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. పుచ్చకాయ లో నీరు పుష్కలంగా ఉంటుంది . ఇది కాకుండా, ఇందులో ఫైబర్, పొటాషియం, ఐరన్ ఇంకా అనేక ఇతర అంశాలు పుష్కలంగా ఉన్నాయి. పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో డిహైడ్రాషన్ తొలగిపోయి కడుపులో చల్లదనాన్నిపెంచుతుంది .

మామిడికాయ(Mango)
ఎండాకాలం వచ్చిందంటే చాలు పండ్ల రారాజు మామిడి కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండును అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. మామిడికాయ షేక్ మరియు పుల్లని మామిడి చట్నీ ఇలా ఎన్నో రకాల వంటకాలను మామిడి తో తయారు చేసుకుంటారు . . ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి, పొటాషియం, కాల్షియం, కాపర్ వంటి అనేక పోషకాలు మామిడి లో పుష్కలంగా ఉంటాయి . ఈ సీజన్‌లో మామిడి పండ్లను తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు.. ఇది కళ్ల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

లిచీ(Litchi)
లిచ్చి వేసవిలోవచ్చే ప్రత్యేకమైన పండ్లలో ఒకటి. ఇది చాలా రుచికరమైన జ్యుసి ఫ్రూట్. ఇందులో చాలా నీరు ఉంది. విటమిన్-సి, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు లిచిలో లభిస్తాయి. ఇది జీర్ణక్రియకు మంచిగా సహకరిస్తుంది .

జామున్(నేరేడు పండు )(jamun)
నేరేడు పండు తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వేసవిలో తినే ప్రత్యేకమైన పండు. ఇందులో రుచితో పాటు అనేక గుణాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్-సి మరియు ఐరన్ ఇందులో తగినంత పరిమాణంలో ఉంటాయి, ఇది శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.

Updated On 14 April 2023 7:05 AM GMT
rj sanju

rj sanju

Next Story