రోజంతా డెస్క్ వద్ద కూర్చోవడం వల్ల గుండె జబ్బులు(Heart problems) వచ్చే ప్రమాదం గణనీయంగా ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
రోజంతా డెస్క్ వద్ద కూర్చోవడం వల్ల గుండె జబ్బులు(Heart problems) వచ్చే ప్రమాదం గణనీయంగా ఉందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఎంత శారీరక శ్రమ చేసినా కూడా ఎక్కువసేపు కూర్చోవడం(Siting) వల్ల గుండెపోట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్ మరియు ఉమెన్స్ హాస్పిటల్‌లో అధ్యయనం ప్రధాన రచయిత, కార్డియాలజీ డాక్టర్ ఎజిమ్ అజుఫో ఈ అధ్యయనం వివరాలు వెల్లడించారు. ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. దీని వల్ల కలిగే నష్టాలు, మార్గదర్శకాలను గుర్తించడానికి మరింత పరిశోధన అవసరమని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో బిహేవియరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కీత్ డియాజ్(Dr.Kith diaz) పేర్కొన్నారు. ఇది ఒక వారం పాటు యాక్సిలరోమీటర్‌లను ధరించిన 90,000 మందిలో ఈ డేటా విశ్లేషించింది. దీర్ఘకాలం కూర్చోవడం మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం మధ్య స్పష్టమైన సంబంధాన్ని వెల్లడిస్తున్నాయి. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను(Fat levels) నియంత్రించడంలో కండరాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఎక్కువసేపు కూర్చోవడం హానికరమని వివరించారు. విరామం తీసుకోని పనిచేయాలంటున్నారు. రోజులో ఎక్కువ సమయం కూర్చునే కార్యాలయ ఉద్యోగులు 10 గంటలకు మించి ఉండకూడదని సూచిస్తున్నారు. ట్రెడ్‌మిల్, వాకింగ్ ప్రభావవంతంగా ఉంటాయన్నారు. ప్రతి 30-60 నిమిషాలకు గ్యాప్ తీసుకొని కొన్ని నిమిషాలు నిలబడాలని లేదా నడవాలని చెప్తున్నారు.