మన శరీరంలో(Body) అతి పెద్ద అవయవం అంటే చిన్న పిల్లాడు కూడా చెప్పేది చర్మం(Skin) అని. శరీరంలో ఎక్కువ భాగం కనిపించేది కూడా చర్మమే.
మన శరీరంలో(Body) అతి పెద్ద అవయవం అంటే చిన్న పిల్లాడు కూడా చెప్పేది చర్మం(Skin) అని. శరీరంలో ఎక్కువ భాగం కనిపించేది కూడా చర్మమే. దీని ముఖ్యమైన పనులలో అంతర్లీనంగాఉన్న భాగాలైన మాంసం(Muscle), ఎముకలు(Bones), రక్త నాళాలు(Veins) మొదలైనవి రక్షించేదిచర్మమే. మరి ఆ చర్మానికి ఏమైనా జబ్బు చేస్తే.. చర్మంతో పాటు ఈ అవయవాలు కూడా భక్షణకు గురవుతాయి.
చర్మం అవయవాలనురక్షించడంతో పాటు.. శరీర ఉష్ణోగ్రతను(temperature) నియంత్రిస్తాయి. శరీరం పోషణ కోసం అవసరమైన నీరు(water), విటమిన్లు(Vitamins), చమురు(Oils) మరియు అవసరమైన కొవ్వుపదార్థాలను(Fats) చర్మం నిల్వచేస్తుంది. చర్మానికి ఉన్న మరో విశేషగుణం ఏంటీ అంటే..? మన శరీరంలోని కొన్ని కీలక భాగాలకు వ్యాధి సోకినప్పుడు ఆ వ్యాధి(disease) లక్షణాలు కొన్ని చర్మం మీద కూడా కనిపిస్తాయి.
అంతే కాదు కొన్ని సందర్భాల్లో.. చర్మానికి వ్యాధి సోకినప్పుడు ఆ దుష్ప్రభావాలు శరీరంలోని కీలకభాగాలను వ్యాధిగ్రస్తం చేస్తాయి. చర్మానికి సంబంధించిన వ్యాధులు దాదాపు 50వరకు ఉంటాయని అంచనా..? కొన్ని ఎక్జాంపుల్స్ కు చెప్పుకోవవాలి అంటే.. సోరియాసిస్(psoriasis), మొటిమలు(pimples), దురదలు(itching), నల్ల మచ్చలు(dark spots), ఎక్జిమా, బొల్లిమచ్చలు, గజ్జితామర(allergy), కాళ్ళపగుళ్ళు మొదలగునవన్నీ చర్మవ్యాధులే.
చర్మవ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బ్లడ్ నీట్(clean blood) గా లేకపోవడం. వాతం, రక్తం మలినం వ్వడం.. వైరస్ లు.. లాంటివి వాటికి తోడు..ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, దుమ్ముదూళి, వాతావరణ కాలుష్యం,మలబద్ధకం ఉన్నవాళ్ళు, సకాలంలో ఆహారం తీసుకోని వాళ్ళకి,
థైరాయిడ్, డయాబెటిస్, ఆస్తమా ఉన్నవారికి కూడా చర్మరోగాలు రావచ్చు.
రోజుకు 8 గ్లాసుల నీరు తాగితే చర్మంలో తేమతత్వం పెరిగి చర్మం పొడిబారకుండా చర్మవ్యాధులకు దూరంగా పటుత్వంతో ఉంటుంది.రోజు
ఒళ్ళంతా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి.గులాబి రేకుల చూర్ణము, చందనము, కుంకుమపువ్వు, బాదం పలుకులు కలిపి నూరి ముఖముపై లేపనము చేస్తేమొటిమలు, నల్లమచ్చలు తగ్గి ముఖకాంతి, వర్చస్సు పెరుగును. ముఖ్యంగా ఈ సమ్మరో లో చర్మాన్నిచాలా జాగ్రత్తగా కాపాడుకోండి...లేకుంటే సమస్యల్లో పడతారు.