వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ సీజన్ లో పెంపుడు జంతువుల(Pet Animals) ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో జ్వరం(Fever), జలుబు(Cold), దగ్గు(Cough) తరచుగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగం వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ సీజన్ లో పెంపుడు జంతువుల(Pet Animals) ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో జ్వరం(Fever), జలుబు(Cold), దగ్గు(Cough) తరచుగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగం వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే మీ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అలాగే పరిసరాలు శుభ్రంగా లేకపోవడం.. నీరు నిల్వ ఉండడం వలన దోమలు సమస్య పెరుగుతుంది.
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు..
ఉల్లిపాయ(Onion), వెల్లుల్లి(Garlic):
సహజంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి యాంటీవైరల్(Anti viral), యాంటీ బాక్టీరియల్(Anti bacterial) లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం. ఇది వర్షాకాలంలో వ్యాపించే జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది.
పుష్కలంగా నీరు తాగాలి(Water)..
వర్షాకాలంలో దాహం తగ్గడంతో నీరు తాగడం తగ్గిస్తారు. కానీ దాహం వేయకపోయినా నీరు తాగడం చాలా ముఖ్యం.
రోడ్ సైడ్ ఫుడ్(Road side food) మానుకోండి..
ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి వర్షాకాలంలో వీధి ఆహారాన్ని తీసుకోవద్దు. వర్షాకాలంలో వీధి ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. జీర్ణశయ సమస్యలను తగ్గించడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి.
ప్రోబయోటిక్స్(Probiotics):
ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు(Curd), పులియబెట్టిన కూరగాయలు(fermented Vegetables) వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణశయ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.