Zombie Virus : జడలు విప్పుకుంటున్న 50 వేల ఏళ్లనాటి వినాశకర వైరస్‌లు... పొంచి ఉన్న పెను ఉపద్రవం
సుమారు 50 వేల సంవత్సరాల కిందట మంచుఫలకాల(Ice sheet) కింద సుషుప్తావస్థలో ఉన్న వినాశకర వైరస్‌లు(Virus) నెమ్మదిగా జడలు విప్పుకుంటున్నాయి. ప్రపంచ మానవాళిపై కోరలు చాపడానికి సిద్ధమవుతున్నాయి. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరికి బయటకు వస్తున్న ఆ వైరస్‌లతో పెను ఉపద్రవం పొంచి ఉందని జీవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నేసి వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ వైరస్‌లకు ఇప్పటికీ మరో జీవికి సోకే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 50 వేల సంవత్సరాల కిందట మంచుఫలకాల(Ice sheet) కింద సుషుప్తావస్థలో ఉన్న వినాశకర వైరస్‌లు(Virus) నెమ్మదిగా జడలు విప్పుకుంటున్నాయి. ప్రపంచ మానవాళిపై కోరలు చాపడానికి సిద్ధమవుతున్నాయి. పర్యావరణ మార్పులు, భూతాపం కారణంగా మంచు కరికి బయటకు వస్తున్న ఆ వైరస్‌లతో పెను ఉపద్రవం పొంచి ఉందని జీవ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇన్నేసి వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ వైరస్‌లకు ఇప్పటికీ మరో జీవికి సోకే వీలుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యాలోని(Russia) సైబీరియా(Siberia) ప్రాంతంలో యాకూచి అలాస్ సరస్సులో తవ్వితీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్‌లను గుర్తించిన జీవశాస్త్రవేత్తలు భయాందోళనలను వ్యక్తం చేశారు. కొన్నిరకాల వైరస్‌లకు జాంబీ వైరస్‌లుగా(Zombie Virus) వర్గీకరించారు. అంటే దెయ్యం వైరస్‌లన్నమాట! నిద్రాణమై ఉన్న ఆ వైరస్‌లకు మరో జీవికి సంక్రమించే శక్తి వాటికి ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎయిక్స్ మార్సెల్లీ విశ్వవిద్యాలయంలో జన్యు శాస్త్రవేత్త జీన్ మైఖేల్ క్లావెరీ.
ఈ మంచు ఫలకాల కింద వైరస్‌లు బయటకు వచ్చి వ్యాప్తి చెందితే ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు చెప్పలేమని నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్ ఎరాస్‌మస్ మెడికల్ సెంటర్‌లోని వైరాలజీ శాస్త్రవేత్త మేరియాన్ కూప్‌మెన్స్ అంటున్నారు. అయితే 2014లో సైబీరియాలో తాము ఇదే తరహా వైరస్‌లను పరీక్షించామని, వాటికి ఏకకణ జీవులకు సోకే సామర్థ్యం ఉందని తేలిందని, 2015లోనూ ఇదే తరహా పరీక్షలు చేశామని, ల్యాబ్‌లో అభివృద్దిచేసిన జీవులకూ ఈ వైరస్‌లు సోకాయని ఆయన చెబుతున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో మానవసంచారం పెరగనంతకాలం వీటితో ప్రమాదం ఏమీ లేదని మేరియాన్ కూప్‌మెన్స్ తెలిపారు. శతాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న పురాతన పొలియో వ్యాధికారక వైరస్‌లకు ఇప్పటికీ ఆ సంక్రమణ శక్తి ఉండవచ్చని, మనుషుల రాకపోకలతో అంటువ్యాధులను వ్యాపింపజేసే వైరస్‌లు ఆర్కిటిక్ ప్రాంతం దాకా వ్యాపిస్తే అవి, ఇవీ అన్ని కలసి కొత్తరకం ఊహించని వ్యాధుల వ్యాప్తికి కారణమవుతాయని వేరియాన్ కూప్‌మెన్స్(Varian Koopmans) చెబుతున్నారు