హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ఆస్పత్రులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. స్కార్లెట్ జ్వరం(Scarlet Fever) వేగంగా వ్యాప్తి చెందడంతో పిల్లల తాకిడి పెరిగిపోతుంది. ప్రారంభ సమయంలో ఈ వ్యాధి వల్ల చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ఆస్పత్రులు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి. స్కార్లెట్ జ్వరం(Scarlet Fever) వేగంగా వ్యాప్తి చెందడంతో పిల్లల తాకిడి పెరిగిపోతుంది. ప్రారంభ సమయంలో ఈ వ్యాధి వల్ల చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ ఆస్పత్రిలో 20 మంది జ్వర బాధితుల్లో 10 నుంచి 12 మంది ఈ స్కార్లెట్‌ బారినపడ్డవారే కావడం గమనార్హం. కొందరిలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైరల్‌ లక్షణాలు కన్పించినా చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఆస్పత్రి వెళ్లక తప్పదని వైద్యులు చెప్తున్నారు. . లక్షణాలు కన్పించిన వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు. స్కార్లెట్‌ జ్వరం స్ట్రెప్టోకోకల్‌ ఫారింగైటిస్‌ బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని.. ఈ జ్వరం సోకినపిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు అంటుకుంటుంది. ఈ తుంపర్లు పడిన చోట చేతులు పెట్టి వాటిని గొంతు, ముక్కు వద్ద తాకించినా ఇతరులకు సోకుతుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఈ స్కార్లెట్‌ జ్వరంపై తల్లిదండ్రులకు జాగ్రత్తలు చెప్తూ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ఈ జ్వరం లక్షణాలు కన్పిస్తే చికిత్స అందించాలని వ్యాధి తగ్గే వరకు పిల్లలను స్కూల్‌కు పంపించొద్దని యాజమాన్యాలు కోరుతున్నాయి.

స్కార్లెట్‌ వ్యాధి లక్షణాలు(Symptoms):

102 డిగ్రీలతో కూడిన జ్వరం
గొంతు, నాలుకపై తెల్లని పూత
కడుపునొప్పి, శరీరంపై దద్దుర్లు
ఆకస్మాత్తుగా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు
నాలుక స్ట్రాబెర్రీ రంగులోకి మారడం
ట్రాన్సిల్స్‌ ఎరుపు రంగులో పెద్దవిగా కనిపించడం

Updated On 1 March 2024 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story