ఓట్స్.. ప్రెజెంట్ బరువు తగ్గడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే, వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా వస్తుందట.

ఓట్స్.. ప్రెజెంట్ బరువు తగ్గడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే, వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కూడా వస్తుందట. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దీంతో నేడు చాలా మంది ఓట్స్‌ని తినడానికి ఇష్టపడుతున్నారు. అయితే, ఈ మధ్యకాలంలో ఓట్స్ తిన్నతర్వాత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులోని సాల్మొనెల్లా బ్యాక్టీరియానే కారణం.దీని గురించి ఏం చేయాలో తెలుసుకోండి.

జీర్ణ సమస్యలు..

చాలా మందికి ఏవైనా ఫుడ్స్ తిన్నప్పడు కడుపునొప్పి వస్తుంది. అందులో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియానే కారణం. ఓట్స్‌లోనూ అదే బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. అది అసలు ఓట్స్‌లో ఎలా వచ్చిందని ఆరా తీస్తే ఓట్స్‌ని ప్యాకింగ్ చేసే సమయంలో అజాగ్రత్తగా ఉండడం, సరిగ్గా వండకపోవడమే ఇందుకు కారణాలు. ప్యాకింగ్ చేసేటప్పుడు పరిశుభ్రత పాటించకపోతే ఈ వైరస్‌లు ఓట్స్‌లోకి చేరతాయి. వాటిని సరిగ్గా ఉడికించకపోతే అనారోగ్య సమస్యలకి కారణమవుతాయి.

బ్యాక్టీరియా..

ఇలాంటి ఓట్స్ తినడం వల్ల వికారం, శరీర నొప్పులు, జ్వరం, చలి ఇలా అన్నీ సమస్యలు ఇన్ఫెక్షన్స్‌కి కారణమవుతుంది. అదనంగా వాంతులు, విరోచనాలు, కడుపునొప్పులు కూడా ఉంటాయి. వీటికి సరైన విధంగా ట్రీట్‌మెంట్ చేయించకపోతే ఈ బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి ప్రాణాపాయంగా మారుతుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇన్‌స్టంట్ ఓట్స్..

చాలా మంది ఇన్‌స్టంట్ ఓట్స్‌ని కొంటారు. వీటిని వండడానికి తక్కువ టైమ్ పడుతుంది. రుచికరంగా ఉంటాయి. దీని వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఓట్స్‌ని కరెక్ట్‌గా 70 డిగ్రీల వరకూ ఉడికించాలి. అందుకే, వీటిని కొనడం, వండే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మిగిలిన రెండు రకాలు..

ఇంతలో ఇన్‌స్టంట్ ఓట్స్‌లో బియ్యంతో సమానంగా జీఐ ఉంటుంది. ఇందులో పీచులని తీసి గ్రైండ్ చేసి తయారు చేస్తారు. వీటిని పాలతో వండుతారు. దీంతో మరింత ప్రమాదకరంగా మారుతుంది. వీటిని త్వరగా ఉడికిస్తాం.. ఎక్కువ వేడి అవసరం లేదు. అదే సమయంలో, మిగిలిన రెండు రకాల ఓట్స్ అంత ప్రమాదం కాదు.

ఏవి కొనాలంటే..

సాధారణంగా మనకి 3 రకాల ఓట్స్ దొరుకుతాయి. అందులో ఇన్‌స్టంట్, రోల్డ్, స్టీల్ కట్ ఓట్స్. ఇన్‌స్టంట్ ఓట్స్ త్వరగా ఉడుకుతాయి. కాబట్టి, సమస్యకి కారణమవుతుంది. మరో రెండు రకాల ఓట్స్‌ బరువు తగ్గడం, ఆరోగ్యానికి చాలా మంచివి. స్టీల్ కట్ ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 53. షుగర్ లెవల్స్ త్వరగా పెరగదు. రోల్డ్ ఓట్స్‌లో 57 జీఐని కలిగి ఉంటుంది. వీటిని ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి రెండింటిలో ఏవైనా ఆరోగ్యానికి మంచివే.

ehatv

ehatv

Next Story