కేరళ(Kerala)లో మరో అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. అత్యంత అరుదుగా సోకే అమీబా ఇన్ఫెక్షన్ కేసు నమోదయ్యింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్((primary amoebic meningoencephalitis) అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
కేరళ(Kerala)లో మరో అరుదైన వ్యాధి వెలుగులోకి వచ్చింది. అత్యంత అరుదుగా సోకే అమీబా ఇన్ఫెక్షన్ కేసు నమోదయ్యింది. తీర ప్రాంతంలో ఉన్న అలప్పుజా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వ్యాధిని గుర్తించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్((primary amoebic meningoencephalitis) అనే పేరు గల ఈ వ్యాధి కారకాన్ని ఓ 15 ఏళ్ల వ్యక్తి శరీరంలో గుర్తించినట్లు వైద్యులు పేర్కొన్నారు. కలుషిత నీటిలో స్వేచ్చగా జీవించే అమీబా కారణంగా ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. .
పనవల్లీ ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల వ్యక్తి తీవ్ర జ్వరంతో హాస్పిటల్‌లో చేరాడు. తలనొప్పి, వాంతులు, మూర్ఛ వంటి ఇతర లక్షణాలు కూడా అతడిలో గమనించిన వైద్యులు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడి శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపారు. వైద్య పరీక్షలో అమీబా కారణంగా సోకే అరుదైన వ్యాధి కారకం అతడి శరీరంలో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. రోగి శరీరంలోకి ముక్కు ద్వారా వ్యాధి కారకం ప్రవేశిస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలుషిత నీటితో స్నానం చేయకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మెదడుపై దాడి చేస్తుందని చెబుతున్నారు. కలుషిత నీటితో ముక్కు, నోటని కడుక్కోవడం వల్ల కూడా ఈ వ్యాధి సోకుతుందని వైద్య ఆరోగ్య శాక అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. నిపా వైరస్(Nipah virus), జికా వైరస్(Zika virus) చివరకు కరోనా వైరస్(Corona Virus) కూడా దేశంలో మొదటగా వెలుగు చూసింది కేరళ(Kerala)లోనే!