వేసవికాలం (summer)వచ్చేసింది అందరు చల్లటి వస్తువులను తినటానికి ,తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ తాగని వారుండరు. నిజానికి వేసవిలో శరీరానికి నీటి అవసరం ఎక్కువుగా ఉంటుంది. వీపరీతమైన దాహం వేస్తుంటుంది . దాంతో చల్లటి నీరు తాగటానికి ఇష్టపడతాం . నిజానికి అతి చల్లగా మంచినీరు లేదా ఏ ఇతర పదార్దాలు తీసుకున్న అవి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి . అందుకే వేసవిలో మట్టి కుండలోని నీటిని తాగటం శ్రేష్టం. పిల్లలకు ముఖ్యంగా ఈ అలవాటు చేయటం మంచిది . కూల్ డ్రింక్స్ జోలికి పోనీయకుండా ఈ కుండలో నీటిని అలవాటు చేయండి .కుండలో నీరు చల్లదనము కోసమే కాదు నిజానికిమట్టి కుండలో నీరు తాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి . ఫ్రిడ్జిలు లేని కాలంలో మన పూర్వికులు ఈ మట్టి కుండా నీటిని తాగి ఎంతో ఆరోగ్యంగా జీవించేవారు . కుండలోని నీటి వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం .

మట్టికుండలో నీటిని వేసినపుడు అవి సహజంగానే చల్లగా మారుతాయి. . మట్టి కుండ (pot water)ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాల ద్వారా నీరు వేగంగా ఆవిరైపోతుంది. ఈ బాష్పీభవన ప్రక్రియలో కుండలోని నీటిలో వేడి తగ్గి పోయి అవి సహజంగా చల్లగా మారుతాయి .
రిఫ్రిజిరేటర్(fridge) నుండి నేరుగా చల్లటి నీటిని తాగడం వల్ల దగ్గు ,జలుబు ఇంకా గొంతు నొప్పి వంటి చికాకులు వస్తాయి . మరోవైపు, మట్టి కుండ నీరు వలన గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది అలాగే దగ్గు,జలుబు వంటివి దరిచేరనివ్వదు . అలాగే కుండా నీటిని తాగడం వల్ల వృద్యాప్యం తొందరగా దరిచేరనీయదు .
కుండలో నీటిని తాగటం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు రావు .ఫ్రిడ్జ్ నీటిని తీసుకోవటం వలన ఆహారం తొందరగా జీర్ణం కాదు . అందువల్ల ఎసిడిటీ ఇంకా ఉదర సంబంధించిన సమస్యలు వస్తాయి. కుండా నీటి వలన ఇలాంటి సమస్యలు తలెత్తవు .
ప్రతిరోజూ మట్టి కుండ నీటిని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది ఎందుకంటే ఇందులో ఏ రకమైన రసాయనాలు ఉండవు. నీటిలో ఉండే ఖనిజాలు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి.
వేసవిలో వేడి, వడదెబ్బ(sun stroke) అనేది సాధారణ సమస్య. మట్టి కుండ నుండి నీరు త్రాగడం వడదెబ్బను నివారించడంలోఉపయోగపడుతుంది . ఎందుకంటే మట్టి కుండ నీటిలోని సహజంగా ఏర్పడే విలువైన ఖనిజాలు ఇంకా పోషకాలు మనకు లభిస్తాయి . ఇవి డి హైడ్రాషన్ (de hydration)సమస్యను దరిచేరనివ్వదు .
మనం మినరల్ వాటర్(mineral water) అని కొనుక్కొని డబ్బులు పోసి తాగే నీరుకంటే ఎన్నో రేట్ల మెరుగైన ఆరోగ్యాన్ని ,ఆయుషుని అందిచే కుండ నీరు శ్రేయస్కరం .