నవజాత శిశువులు(Infants) ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు(Infections) గురవుతుంటారు. సో తల్లిదండ్రులు అంటువ్యాధులను నివారించడంలో జాగ్రత్తలు పాటించాలని చిల్డ్రన్స్‌ స్పెషలిస్టులు(Pedistratians) చెప్తున్నారు. భారతదేశంలోని(Bharat) 40% నవజాత శిశువులు 2.5 కిలోల కంటే తక్కువ బరువు(weight) కలిగి ఉంటున్నారు. ఇందకు కారణం ప్రీటర్మ్‌ డెలివరీ(Preterm delivery). తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పలు రకాల ఆరోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రీటర్మ్‌ నవజాత శిశువులకు NICUలో ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుంది. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను(Body temperature) నియంత్రించడంలో ఇబ్బంది, కామెర్లు(Jaundice) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముందస్తు జననం , తక్కువ బరువుతో పుట్టినవారికి NICU కీలకం. గర్భధారణ(Pregency) సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ముందస్తు ప్రసవంపై అవగాహన పెంపొందించుకోవాలని గర్భిణీలకు సూచిస్తున్నరు

నవజాత శిశువులు(Infants) ముఖ్యంగా ఇన్ఫెక్షన్లకు(Infections) గురవుతుంటారు. సో తల్లిదండ్రులు అంటువ్యాధులను నివారించడంలో జాగ్రత్తలు పాటించాలని చిల్డ్రన్స్‌ స్పెషలిస్టులు(pediatrician) చెప్తున్నారు. భారతదేశంలోని(Bharat) 40% నవజాత శిశువులు 2.5 కిలోల కంటే తక్కువ బరువు(weight) కలిగి ఉంటున్నారు. ఇందకు కారణం ప్రీటర్మ్‌ డెలివరీ(Preterm delivery). తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు పలు రకాల ఆరోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రీటర్మ్‌ నవజాత శిశువులకు NICUలో ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుంది. ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను(Body temperature) నియంత్రించడంలో ఇబ్బంది, కామెర్లు(Jaundice) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముందస్తు జననం , తక్కువ బరువుతో పుట్టినవారికి NICU కీలకం. గర్భధారణ(Pregnancy) సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ముందస్తు ప్రసవంపై అవగాహన పెంపొందించుకోవాలని గర్భిణీలకు సూచిస్తున్నరు

నవజాత శిశువుల్లో రోగనిరోధక(Immunity) వ్యవస్థలు అప్పుడే వృద్ధి చెందకపోవడంతో ఇన్ఫెక్షన్లకు గురవతుంటారు. చేతులు(Hands) మరియు బట్టలపై(Clothes) ఉండే సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లను నివారించడానికి పరిశుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం. నవజాత శిశువులకు న్యుమోనియా(Pneumonia), బ్లడ్ ఇన్ఫెక్షన్లు(Blood infection), మెదడు ఇన్ఫెక్షన్లు(Brain infection) సర్వసాధారణం. ఇందుకు శుభ్రంగా చేతులు కడుక్కోవడం, శిశువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. అప్పుడే పుట్టిన శిశువులకు కామెర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటున్నారు. ఉదయం పూట సూర్యరశ్మితో(Sunlight) ఇది కొంతవరకు నివారించే అవకాశముందంటున్నారు. కాలేయం(Liver) అప్పడే సరిగా పనిచేయకపోవడం వల్ల కామెర్లు వచ్చే అవకాశముందని, దీనినే ఫిజియోలాజికల్(Physiological) కామెర్లు అంటారని వైద్యు నిపుణులు చెప్తున్నారు. నెగెటివ్(Negative) బ్లడ్ గ్రూపులు ఉన్న తల్లులకు జన్మించిన శిశువులకు కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. సకాలంలో వైద్యం(Treatment) అందిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్నారు.

కొంతమంది నవజాత శిశువుల శ్వాస(Respiration) తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (RDS) అని పిలుస్తారు. RDS ఉన్న పిల్లలకు వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తారని... RDSని ఎప్పటికీ నివారించలేనప్పటికీ, సమగ్ర ప్రినేటల్ కేర్‌తో పాటు దీనిని ముందస్తుగా గుర్తించడం వల్ల నివారించే అవకాశముందంటున్నారు.

Updated On 2 Dec 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story