అయితే ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతోనే బాధపడుతుంటే తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్(Diet)లో బొప్పాయిని తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు .
ప్రస్తుత జీవన శైలీలో మనం తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల రకరకాల రోగాలు దాడి చేస్తున్నాయి. అంతుచిక్కని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టుతున్నాయి. ఇలాంటి సమస్యల్లో ముఖ్యంగా చాలా మంది అధిక శరీర బరువు( Over Weight)తో ఇబ్బందులు పడుతున్నారు . అయితే ఈ బరువును తగ్గించుకోవడానికి కొంతమంది వివిధ రకాల ప్రయత్నాలు, డైట్లు, ఎక్సర్ సైజులు చేసి ...చివరకు బరువు తగ్గక విసిగి పోయి ఉంటారు కదూ....అయితే వెయిట్ లాస్ (Weight Loss) లో బొప్పాయి పండు(Papaya) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది... ఈ బొప్పాయి పండును డైట్(Diet)లో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు(Benefits) కలుగుతాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు( Weight) తగ్గడం అనేది ఎంత పెద్ద సమస్యయో అందరికీ తెలిసిందే..అయితే ప్రస్తుతం శరీర బరువును తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతోనే బాధపడుతుంటే తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైట్(Diet)లో బొప్పాయిని తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు . అయితే బొప్పాయిని క్రమం తప్పకుండా డైట్‌లో చేర్చుకోవడం వల్ల .. శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజూ బొప్పాయి పండ్లను తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అయితే బరువు(Weight) తగ్గడానికి అల్పాహారం నుంచే బొప్పాయి పండ్లను((Papaya) తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం తీసుకునే అల్పాహారంలో సలాడ్స్ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఓట్ మీల్ కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
లంచ్‌లో కూడా బొప్పాయి సలాడ్ తినవచ్చని అంటున్నారు నిపుణులు. ఈ సలాడ్ తప్పకుండా పాలకూర, టొమాటో, ఉప్పు, వెల్లుల్లి, నిమ్మరసం కలిపి తీసుకుంటేనే మంచి ఫలితాలు పొందుతారు. ఈ సలాడ్ (Salad)తీసుకున్న తర్వాత బొప్పాయితో తయారు చేసిన జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. సాయంత్రం (Evening) ఇతర స్నాక్స్‌కి బదులుగా బొప్పాయిని తీసుకుంటే ఇంకా చాలా మంచిది. బొప్పాయి, పైనాపిల్‌లను ముక్కలుగా కట్ చేసి స్మూతీలా తయారు చేసి తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.