సహజమైన అందం కోసం వంటింటి చిట్కాలు చాలానే ఉంటాయి. సౌందర్య సాధనాల్లో బొప్పాయి(Papaya) చేసే మేలు తెలిస్తే.. తప్పకుండా పాటించాలనిపిస్తోంది. బొప్పాయిలో నీటి శాతం(Water percentage) ఎక్కువని, విటమిన్స్‌(Vitamins) ఎక్కువని, క్యాల్షియం(Calcium), జింక్‌(Zinc) మెండుగా ఉంటాయనే విషయాలు ఆరోగ్యాభిలాషులకు తెలిసిందే.

సహజమైన అందం కోసం వంటింటి చిట్కాలు చాలానే ఉంటాయి. సౌందర్య సాధనాల్లో బొప్పాయి(Papaya) చేసే మేలు తెలిస్తే.. తప్పకుండా పాటించాలనిపిస్తోంది. బొప్పాయిలో నీటి శాతం(Water percentage) ఎక్కువని, విటమిన్స్‌(Vitamins) ఎక్కువని, క్యాల్షియం(Calcium), జింక్‌(Zinc) మెండుగా ఉంటాయనే విషయాలు ఆరోగ్యాభిలాషులకు తెలిసిందే. అయితే ఇది మేనుకి(Skin) కూడా ఎంతో మేలు చేస్తోంది. మృతకణాలను తొలగించి.. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. మరింకేం లాభాలున్నాయో చూద్దాం.

మొటిమలు(Pimples) ఆంఫట్‌
మొటిమలు వాటితో ఏర్పడిన మచ్చలు పోయి.. ముఖం కాంతిమంతంగా మారాలంటే.. టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె, కొద్దిగా తులసి ఆకు గుజ్జు వేసుకుని బాగా కలిపి.. ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల పాటు ఆ ప్యాక్‌ని ముఖానికి ఉంచుకుని.. గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటే త్వరగా ఫలితం కనిపిస్తుంది.

నిగారింపు(Glow) నిమిషాల్లో..
వాడిన మోములో మెరుపు రావాలంటే.. చిక్కటి పాలల్లో నానబెట్టిన ఓట్స్‌ని బొప్పాయి గుజ్జులో కలిపి.. కొద్దిగా తేనె జోడించి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మృదువుగా.. మసాజ్‌ చేస్తూ ఉండాలి. ఓట్స్‌ లేని క్రమంలో బొప్పాయి గుజ్జులో పెరుగు కూడా వేసుకుని ముఖానికి అప్లై చేసుకోవచ్చు.

ట్యాన్‌కి(Tan) టాటా బైబై
ట్యాన్‌ పట్టిన చర్మం తిరిగి తెల్లగా, మృదువుగా అందంగా మారాలంటే.. పండిన బొప్పాయి గుజ్జులో కొద్దిగా బియ్యప్పిండి కలిపి.. బాగా మర్దనా చేసుకోవాలి. సుమారు 20 నిమిషాల మర్దనా తర్వాత.. చల్లని నీళ్లతో ముఖం కగుక్కోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం తేజోవంతంగా మారుతుంది.

పట్టులాంటి జుట్టు కోసం..
జుట్టు రాలిపోవడం, తెగిపోవడం వంటి సమస్యలకు కూడా బొప్పాయితో చెక్‌ పెట్టొచ్చు. పావు కప్పు బొప్పాయి గుజ్జులో ఒక కోడి గుడ్డు తెల్లసొన వేసుకుని.. ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలుపుకుని.. ఆ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. ఓ 20 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

రంగు(Fare skin) మారుద్ది
చంకల్లో, మోచేతులు, మోకాళ్లు నల్లగా ఉండే ప్రదేశాల్లో తెల్లగా మారాలంటే.. 2 టేబుల్‌ స్పూన్ల బొప్పాయి గుజ్జులో అర టేబుల్‌ స్పూన్‌ పంచదార పొడి కలిపి.. ఆయా ప్రాంతాల్లో మర్దనా చెయ్యాల్సి ఉంటుంది. పావు గంట పాటు మర్దనా చేసిన తర్వాత చల్లటి నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి.

Updated On 13 April 2023 11:09 PM GMT
Ehatv

Ehatv

Next Story