రక్త పరీక్షతో(Blood test) పాంక్రియాటిక్ క్యాన్సర్(Pancreatic cancer) మొదటి, రెండో దశలను 97 శాతం కచ్చితత్వంతో నిర్ధారించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. లిక్విడ్ బయోప్సీ పరీక్ష ద్వారా రక్తంలో పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు పదార్థాలను కనిపెట్టవచ్చు.
రక్త పరీక్షతో(Blood test) పాంక్రియాటిక్ క్యాన్సర్(Pancreatic cancer) మొదటి, రెండో దశలను 97 శాతం కచ్చితత్వంతో నిర్ధారించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. లిక్విడ్ బయోప్సీ పరీక్ష ద్వారా రక్తంలో పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కారణమయ్యే జన్యు పదార్థాలను కనిపెట్టవచ్చు. దీని ద్వారా సదరు వ్యక్తికి పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తించవచ్చు. పాంక్రియాటిక్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రారంభ దశతో బాధ పడుతున్న వివిధ దేశాలకు చెందిన వెయ్యి మందిపై అధ్యయనం చేశాక పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.