అతడిది మామూలు అదృష్టం కాదు.. ఎంత అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యేటంతటి అదృష్టం. దెబ్బకు అతడి తలరాతే మారిపోయింది. ఆ లక్కీమ్యాన్‌ ఎవరంటే పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన ఇబ్రహి హైదరీ(Ibrahi Hydari).. అతడి వృత్తి చేపలు(Fisherman) పట్టడం. ఎప్పటిలాగే కరాచీ(Karachi) నౌకాశ్రయం దగ్గర ఉన్న అరేబియా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వలలో అరుదైన చేపలు పడ్డాయి.

అతడిది మామూలు అదృష్టం కాదు.. ఎంత అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యేటంతటి అదృష్టం. దెబ్బకు అతడి తలరాతే మారిపోయింది. ఆ లక్కీమ్యాన్‌ ఎవరంటే పాకిస్తాన్‌కు(Pakistan) చెందిన ఇబ్రహి హైదరీ(Ibrahi Hydari).. అతడి వృత్తి చేపలు(Fisherman) పట్టడం. ఎప్పటిలాగే కరాచీ(Karachi) నౌకాశ్రయం దగ్గర ఉన్న అరేబియా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. వలలో అరుదైన చేపలు పడ్డాయి. అవి మామూలు చేపలు కాదు. గోల్డెన్‌ ఫిష్‌(Golden fish), సోవా అంటారు. చాలా విలువైన చేపలవి! ఈ చేపల్లో మంచి ఔషధగుణాలు(Medicine) ఉంటాయి. వైద్యంలో ప్రముఖంగా వాడతారు. వీటిలోని దారంలాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాలో వినియోగిస్తారు. ఒక్కో చేప విలువ ఎంత కాదనుకున్నా 70 లక్షల రూపాయలుంటుంది. వలలో పడిన చేపలన్నింటినీ అమ్మేస్తే అతడికి ఏడు కోట్ల రూపాయలు వచ్చాయి. ఓవర్‌నైట్‌ కోటీశ్వరుడయ్యాడు. గోల్డెన్‌ ఫిష్‌ చేప 20 నుంచి 40 కిలోల బరువు ఉంటుంది. ఒకటిన్నర మీటర్ల వరకు పెరుగుతుంది. స్థానిక వంటకాల్లోనే కాదు, ఔషధాల్లోనూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కోట్లకు కోట్లు వచ్చి పడటంతో ఇబ్రహి హైదరీ ఫుల్లు హాప్పీగా ఉన్నాడు. సంతానోత్పత్తి కాలంలోనే ఇవి తీరానికి వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని హైదర్‌ అంటున్నాడు. హైదర్‌ ది ఎంత గొప్ప మనసు అంటే వచ్చిన సొమ్మును తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా అంటున్నాడు.

Updated On 13 Nov 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story