ఈ కాలంలో సంతానలేమి(Inferlity) సమస్యతో చాలా మంది దంపతులు సతమతమవుతున్నారు.
ఈ కాలంలో సంతానలేమి(Inferlity) సమస్యతో చాలా మంది దంపతులు సతమతమవుతున్నారు. ఆడ, మగతో సంబంధం లేకుండా ఈ సమస్యకు కారకులవుతున్నారు. ఒకప్పుడు సంతానం కలగలేదంటే స్త్రీలు మాత్రమే కారణమని నిందించేవారు. కానీ ఇటీవల కాలంలో పురుషుల్లో కూడా వంధత్వ రేటు బాగా పెరిగిపోతుంది. పురుషుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు(Food habits), జీవన శైలి, పనిఒత్తిడి(Work presuure), కాలుష్యం వంటి కారణాలు కూడా పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి, వాటి నాణ్యత తగ్గిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. పురుషులు వాకింగ్, సరైన ఎక్సర్‌సైజ్ చేస్తే వీర్యకణాల క్షీణత నుంచి బయటపడే అవకాశం ఉందని పలువురు చెప్తుంటారు. కానీ ఈ మధ్యే ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.
అతిగా జిమ్(Over work out) చేస్తే పురుషుల్లో వీర్యకణాల(Sperm) ఉత్పత్తి తగ్గిపోతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫిట్‌నెస్ ఫీల్డ్‌లో ఉన్నవారిలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు వెల్లడించాయి! యూకేలో జరిపిన అధ్యయనంలో(Survey) సంతానలేమీ ఉన్న పురుషులను పరిశీలించారట. వీరిలో అతిగా జిమ్‌లో గడిపేవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. జిమ్‌లో ఎక్కువ సమయం గడిపేవారిలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిట్‌నెస్ కోచ్‌లు, ఫిట్‌నెస్‌కు అధికా ప్రాధాన్యత ఇచ్చేవారు ఎక్కువ శాతం బిగతుగా ఉండే దుస్తులు ధరిస్తారు. జిమ్‌లో పనిచేసేవారైతే సుమారు 12 గంటల పాటు ఇలాంటి టైట్ డ్రెస్‌లో(Tight dress) ఉంటారు! వారంలో ఆరు రోజులు దాదాపు అలాంటి దుస్తులే వేసుకుంటారు! దీంతో సహజంగానే వృషణాల ప్రాంతాల్లో హీట్ జనరేట్ అవుతుంది. మనిషి చూడడానికి ఫిట్‌గా ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో హీట్ జనరేట్ కావడంతో వీర్య కణాలు చనిపోతాయని అధ్యయనం వెల్లడించింది. జిమ్‌లో కాస్త సమయం గడిపి వదులుగా ఉన్న దుస్తులు ధరించేవారిలో ఈ సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.