పారాసెటమాల్, కాల్షియం, విటమిన్ డి3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిస్ మాత్రలు

పారాసెటమాల్, కాల్షియం, విటమిన్ డి3 సప్లిమెంట్స్, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు ఔషధాలతో సహా 50 కంటే ఎక్కువ ఔషధాలు భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) నాణ్యత పరీక్షలలో విఫలమయ్యాయి. తాజా నెలవారీ ఔషధ హెచ్చరికల జాబితాలో, CDSCO 53 ఔషధాలను "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (NSQ) హెచ్చరిక"గా ప్రకటించింది. విటమిన్-సి, డీ 3 మాత్రలు షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్ (Vitamin B Complex)మరియు విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డి, పారాసెటమాల్ మాత్రలు ఐపి 500 ఎంజి, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హై బ్లడ్ ప్రెజర్ డ్రగ్ టెల్మిసార్టన్, అత్యధికంగా అమ్ముడవుతున్న మందులలో ఉన్నాయి. డ్రగ్ రెగ్యులేటర్ ద్వారా నాణ్యత తనిఖీలో విఫలమయ్యాయి. అయితే తనిఖీలు చేసిన బ్యాచ్‌లు నకిలీవని తాము తయారు చేసినవి కావని ఔషధ కంపెనీలు పేర్కొన్నాయి.

ehatv

ehatv

Next Story