వెల్లుల్లి(Onions) కాస్త వేడి చేస్తుంది కాని.. అది చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా మన గుండె(Heart) పనితీరు మెరుగుపడటం కోసం వెల్లుల్లిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మర్చిపోకండి ఏదోవాసన వస్తుంది కదా..

వెల్లుల్లి(Garlic) కాస్త వేడి చేస్తుంది కాని.. అది చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా మన గుండె(Heart) పనితీరు మెరుగుపడటం కోసం వెల్లుల్లిని మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మర్చిపోకండి ఏదోవాసన వస్తుంది కదా.. అని వెల్లుల్లి తినడం మానేస్తే.. చాలా నష్టపోవల్సి వస్తుంది.

వెల్లుల్లిని రకరకాల రోగాలకు మందుగా(Medicine) వాడవచ్చు.. అజీర్ణము(Digestion), గుండెజబ్బులు, కడుపునొప్పి, చర్మవ్యాధులు, శ్వాస, క్రిమిరోగాలు వంటి వాటిలో వెల్లుల్లిని విరివిగా వాడతారు. ప్రస్తుతం ఇంగ్లీష్ వైద్యంలో కూడా వెల్లుల్లి విలువ తెలిసి అందులో వాడుతున్నారంటే వెల్లుల్లు చేసే మేలు తెలుసుకోవచ్చు.

వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి, చూర్ణం చేసుకుని అంటే పొడిగా చేసుకుని.. 1 గ్రాము పసుపు, 1 గ్రాము చూర్ణం తీసుకుని దీనిని ఒక గ్లాసు పాలలో వేసి బాగా మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఉబ్బసం వ్యాధి తగ్గిపోతుంది.

వెల్లుల్లి రసం వేడినీటిలో కలుపుకొని త్రాగుతుంటే ఉబ్బసం, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గిపోతాయి. ఊపిరితిత్తుల వ్యాధులకు వెల్లుల్లి దివ్యౌషధం. కంఠస్వరాన్ని బాగుచేస్తుంది. క్షయవ్యాధిలోనూ - న్యూమోనియాలోను కఫాన్ని కరిగించి శ్వాస ఆడడానికి దోహదం చేస్తుంది.

వెల్లుల్లి పొట్టకు మేలు చేస్తుంది అందుకే సాయంత్రం పచ్చిగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఎంత తీవ్రమైన అల్బర్స్
అయినా మానిపోతాయి. అంటే... అల్సర్సున్ను కలిగించే బాక్టీరియాను వెల్లుల్లి తుదముట్టిస్తుంది. వెల్లుల్లికి జీర్ణశక్తిని బాగా పెంచే గుణం ఉంది. ఆహారాన్ని సరిగ్గా వంటికి పట్టేలా చేస్తుంది. ఒంట్లో చేరిన వాతాన్ని నివారిస్తుంది.

అంతే కాదు వెల్లుల్లి సహజసిద్ధమయిన విరేచనకారి. తేలిగ్గా అరగని ఆహారపదార్థాలు తీసుకోవాల్సి వస్తే వెల్లుల్లిని కలిపి తీసుకుంటూ, చక్కనిఫలితాలు పొందవచ్చు.. ఎంతటి పదార్దం అయినా అరిగిపోయి.. ఫ్రీ మోషన్ అవుతుంది అప్పుడు. ః

వెల్లుల్లి ఎన్నో రకాల చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది. పసుపు, తులసి, వేప బెరడుతో కలిపి రోజూ మూడు గ్రాముల చొ॥న తింటూ ఉంటే, చర్యవ్యాధులు తగ్గిపోతాయి. ఇవే కాదు టీవి, మలేరియా లాంటి వ్యాధులకు కూడా వెల్లుల్లు బాగా పనిచేస్తుంది. వెల్లుల్లిని అన్నంతో పాటు ఉడికించుకుని తింటే.. టీబి వ్యాధి తగ్గుతుందని పెద్దలు అంటారు.

Updated On 17 April 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story