కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌(Covi shield vaccine) తీసుకున్నవారిలో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్(Side Effets) వస్తున్నాయనే వార్త ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందనే విషయాన్ని స్వయంగా ఆస్ట్రాజెనికా కంపెనీ(AstraZeneca)నే అంగీకరించింది.

కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌(Covi shield vaccine) తీసుకున్నవారిలో తీవ్రమైన సైడ్‌ ఎఫెక్ట్స్(Side Effets) వస్తున్నాయనే వార్త ప్రకంపనలు సృష్టించింది. తమ కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందనే విషయాన్ని స్వయంగా ఆస్ట్రాజెనికా కంపెనీ(AstraZeneca)నే అంగీకరించింది. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల రక్తకణాలు (ప్లేట్ లెట్స్) సంస్థ గణనీయంగా తగ్గిపోతుందని ప్రకటించడంతో కోవిషీల్డ్‌ తీసుకున్నవారిలో ఆందోళన మొదలయ్యింది. ఇదే సమయంలో కొవాగ్జిన్‌(Covaxin)వ్యాక్సిన్‌ తీసుకున్నవారు హమ్మయ్య అనుకున్నారు. ఊరిపి పీల్చుకున్నారు. బేఫికర్‌గా ఉన్నారు. ఇప్పుడు కొవాగ్జిన్‌ తీసుకున్నవారిలో కూడా బెదురు మొదలయ్యింది. కారణం కొవాగ్జిన్‌తో కూడా సైడ్‌ ఎఫెక్టులు ఉన్నట్టు బెనారన్‌ హిందూ విశ్వవిద్యాలయం గుర్తించడమే! కొవిడ్‌కు విరుగుడుగా భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ తీసుకున్న వారిలో దాదాపు 30 శాతం మంది వేర్వేరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారని బనారస్‌ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ) చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 637 మంది టీనేజర్లు, 291 మంది పెద్దలపై ఏడాది పాటు ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. వీరిలో 304 మంది టీనేజర్లు అంటే 47.9 శాతం మంది, 124 మంది పెద్దల్లో అంటే 42.6 శాతం మందికి శ్వాసకోశ సమస్యలు వచ్చినట్టు గుర్తించారు పరిశోధకులు. యుక్తవయస్కుల్లో 10.5 శాతం మంది చర్మ సంబంధ వ్యాధులతో బాధపడ్డారు. 10.2 శాతం మంది సాధారణ అనారోగ్య సమస్యలు, 4.7 శాతం మందికి నాడీవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు వచ్చాయి పెద్ద వారిలో 8.9 శాతం మంది సాధారణ రుగ్మతలు, 5.8 శాతం మంది మస్కులోస్కెలిటల్‌ సమస్యలు, 5.5 శాతం మంది నాడీ వ్యవస్థ సమస్యలను ఎదుర్కొన్నారు. 4.6 శాతం మంది మహిళలకు రుతుక్రమానికి సంబంధించి సమస్యలు వచ్చాయి. 2.7 శాతం మందిలో కంటి సమస్యలు తలెత్తాయి. 0.6 శాతం మందిలో హైపోథైరాయిడిజం వచ్చింది. కొవాగ్జిన్‌ తీసుకున్న 0.3 శాతం మందిలో స్ట్రోక్‌, 0.1 శాతం మందిలో గులియన్‌-బారే సిండ్రోమ్‌ లాంటి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ను పరిశోధకులు గుర్తించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో కంటే మూడు డోసులు తీసుకున్న వారిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్రత నాలుగింతలు, ఒక డోసు తీసుకున్న వారిలో రెండింతలు ఎక్కువ ఉంది. కొవాగ్జిన్‌ తీసుకున్న 926 మందిపై ఈ అధ్యయనం జరగగా వీరిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. చనిపోయినవారికి షుగర్, బీపీ ఉన్నాయి. వీళ్లలో ఇద్దరికి వాక్సిన్ తీసుకోకముందు నుంచే షుగర్, బీపీ ఉండగా.. ఇద్దరికి మాత్రం వ్యాక్సిన్ తర్వాత వచ్చింది. అయితే ఈ అధ్యయనంపై కొవాగ్జిన్‌ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ రియాక్టయ్యింది. కొవాగ్జిన్‌పై చాలా అధ్యయనాలు జరిగాయని, అన్ని అధ్యయనాలలో కొవాగ్జిన్‌ సురక్షితమైనదని తేలిందని చెప్పింది.

Updated On 17 May 2024 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story