చాన్నాళ్లుగా సుషుప్తావస్థలోకి వెళ్లిపోయిన కరోనా వైరస్‌(Corona Virus) మళ్లీ నిద్రలేస్తున్నది. మూడేళ్లుగా ప్రపంచానికి అష్టకష్టాలు పెట్టి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా లక్షలాది మంది ఉసురు తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పేద గొప్ప, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధించింది.

చాన్నాళ్లుగా సుషుప్తావస్థలోకి వెళ్లిపోయిన కరోనా వైరస్‌(Corona Virus) మళ్లీ నిద్రలేస్తున్నది. మూడేళ్లుగా ప్రపంచానికి అష్టకష్టాలు పెట్టి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా లక్షలాది మంది ఉసురు తీసుకుంది. ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. పేద గొప్ప, చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధించింది. అంతలా ప్రజలను వణికించిన వైరస్‌ పీడ విరగడయ్యిందని అనుకున్నారంతా! మన దేశంలో అయితే గత కొన్ని నెలలుగా కేసులేమీ కనిపించడం లేదు. దీంతో కరోనా కనుమరుగయ్యిందనే అనుకున్నారంతా! సాధారణ జీవితానికి అలవాటుపడ్డారు. కానీ ఇంతలోనే మరో ప్రమాదం తరుముకుని వస్తుందని తెలిసి ఆందోళన చెందుతున్నారు. పలు దేశాలలో కరోనా కొత్త వేరియంట్‌(New Covid variant) కేసులు పెరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా(America)లో కూడా కరోనా కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఈజీ.5 అనే వేరియంట్‌ (variant EG.5.1)ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా కేసులకు కారణమవుతోందని అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ తెలిపింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్‌ జాతికి చెందిన ఎక్స్‌బీబీ1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్‌ వైరస్‌ నుంచి పుట్టుకొచ్చిందని సైంటిస్టులు అంటున్నారు. ఎక్స్‌బీబీ 1.9.2‌ స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో అదనంగా ఒక మ్యూటేషన్ కలిగి ఉందని, ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరంలోని కణాలకు వైరస్ సోకేందుకు స్పైక్ ప్రోటీన్ కీలకమన్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త మ్యూటేషన్ ఇంతకు ముందు ఇతర కరోనా వేరియంట్లలో కూడా కనిపించిందని చెప్పారు. మరోవైపు ఈజీ.5 నుంచి ఇప్పటికే ఈజీ.5.1 (EG.5.1) అని పిలుచుకుంటున్న మరో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చింది. ఇది కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌పై కొలంబియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ ప్రొఫెసర్ డాక్టర్‌ డేవిడ్ హో పరిశోధన చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్న వారిపై ఈ వైరస్‌ ప్రభావం ఎంత వరకు ఉంటుందన్న దానిపై పరిశోధన సాగుతోంది. ఈజీ.5 వేరియంట్‌ ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, జపాన్, చైనాలలో కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్‌ నుంచి మరో కొత్త వేరియంట్ ఈజీ.5.1గా రూపాంతరం చెంది బ్రిటన్‌లో వేగంగా వ్యాపిస్తోంది. చాలా మందికి కరోనా సొకింది.

Updated On 11 Aug 2023 2:27 AM GMT
Ehatv

Ehatv

Next Story