ప్రస్తుతం సీజన్ లతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు వస్తున్నాయి. వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని అయితే.. వాతావరణ పరిస్థితుల వల్ల.. జీవణ ప్రమాణాల వల్ల వచ్చేవికొన్ని. మరి వాటినుంచి ఎలా బయట పడాలి.. ? మన చేతుల్లో ఉన్న ఉపశమన మార్గాలే ఏంటీ.. ? చూసేద్దాం.

ప్రస్తుతం సీజన్ లతో సంబంధం లేకుండా జుట్టు సమస్యలు వస్తున్నాయి. వంశపారంపర్యంగా వచ్చేవి కొన్ని అయితే.. వాతావరణ పరిస్థితుల వల్ల.. జీవణ ప్రమాణాల వల్ల వచ్చేవికొన్ని. మరి వాటినుంచి ఎలా బయట పడాలి.. ? మన చేతుల్లో ఉన్న ఉపశమన మార్గాలే ఏంటీ.. ? చూసేద్దాం.

ఇప్పు డు చిన్న పెద్దా తేడా లేకుండా అందరిలో కనిపించే సమస్య జుట్టు ఊడిపోవడం , చుండ్రు , రకరకాల జుట్టు సమస్యలు . ఇవి
ప్రతి ఒక్కరిని ఏదో ఒక టైంలో బాధిస్తుంటా యి.... జుట్టు సమస్య లు రా వడా నికి అనేక కారణా లు ఉన్న యి... కొంత మందికి వంశ
పా రం పర్యం గా వస్తే... మరికొం త మం దికి లైఫ్ స్టైల్ వల్ల వస్తాయి...

కొంత మందికి వత్తిడి పెరగడం వలన, జుట్టు సమస్య లువస్తాయి.. మరికొం త మం దికి ఎక్కు వ ఏసీ గదు ల్లో ఉం డటం వలన, ఎం డకు , పొ ల్యూ షన్ కు ఎక్కు వ తిరగడం వలన, నీటి సమస్యవలన కూడా జుట్టు ఊడిపోవడం , చుండ్రు రావడం లాంటివి జరుగుతుంది...

ఈ సమస్య గు రిం చి బధపడితే సమస్య పెద్దదౌతుంది కాని తీరదు .. అందుకే జుట్టు పెరగడానికి, చుండ్రు పోడానికి, జుట్టు సమస్య లు తీరడానికి ఇంట్లో నే తయారుచేసుకునే మందుల గురించి చూద్దాం.

ఆరు చెంచాల నీళ్ళలో మూడు చెంచాల వెనిగర్ కలిపండి, షాంపోతో తల స్నానం చేశాక ఈవెనిగర్ నీళ్ళను తలకు పట్టించండి..ఇలా వారానికి ఒకసారి మూడు నుండి నాలుగు నెలలు చేస్తే చుండ్రు సమస్య తొలగిపో తుంది.

పుల్లటి పెరుగులో నిమ్మరసం కలిపి తలస్నా నానికి ఒక గంట ముందు తలకు బాగా పట్టించండి... గంట తరువాత తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే జుట్టు కుదుళ్ళ నుండి బలపడుతుంది. చుండ్రు సమస్య తొలగిపోతుంది జుట్టు నిగారింపు పెరుగుతుంది.

ఉసిరిలో ఐరన్ ఉంటుంది.. ఇది జుట్టుకు బలాన్ని ఇస్తుంది. జుట్టు పెరుగుదలకు దోహదపడు తుంది. ఉసిరి పోడిని కాని ఉసిరి రసాన్ని కాని నిమ్మ రసం లో కలిపి జుట్టు కి సున్నితంగా మర్థనా చేయాలి.. ఇలా చేసిన గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టుకి బలం పెరుగుతుంది. కుదుళ్ళు గట్టిపడతాయి...

మొంతులు కూడా జుట్టు పోషణకు బాగా పనిచేస్తాయి.. మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి తలకు పట్టించి గంట తరువాత స్నానం చేస్తే జుట్టు నిగారింపు పెరుగుతుంది. జుట్టురాలడంఆగుతుంది.

జుట్టు ఊడకుండా ఉండాలంటే ఇలాంటి వాటితో పాటు మనం కూడా కొన్ని జాగ్రత్తగ్రత్తలు పాటించాలి. పొల్యూ షన్ కి .. టెన్షన్స్ కి దూరంగా ఉండాలి. బయట తిరిగినప్పుడు జుట్టును కవర్ చేసుకోవాలి. టెక్షన్స్ కు దూరంగా ఉండా లి. మనసు పరంగా శరీరం పరంగా మలినం లేకుండా ఉండాలి. మంచి నీటిలో ఉండే మినరల్స్ జుట్టు పెరుదలకు ఉపయోగపడతాయి.. చుండ్రును తగ్గిస్తాయి.. అందుకేరోజుకు కనీసం ఎనిమిది నుండి పదిగ్లాసుల నీరు తాగా లి.. ఇలా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా జుట్టును కాపాడుకోవచ్చు .

Updated On 19 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story