వైద్య విద్య పాఠ్యాంశాలకు సవరించిన మార్గదర్శకాలను నేషనల్ మెడికల్ కమిషన్(National medical commission) జారీ చేసింది
వైద్య విద్య పాఠ్యాంశాలకు సవరించిన మార్గదర్శకాలను నేషనల్ మెడికల్ కమిషన్(National medical commission) జారీ చేసింది, సోడోమీ(sodomy), లెస్బియనిజాన్ని(lesbianism) అసహజ లైంగిక(Unnatural sex) నేరాల నుంచి తొలగించింది. ఇది కన్యత్వం మరియు డీఫ్లోరేషన్‌ను నిర్వచించడంతో పాటు హైమెన్, రకాలు, వైద్య-చట్టపరమైన ప్రాముఖ్యత వంటి అంశాలను కూడా రద్దు చేసింది. సవరించిన పాఠ్యప్రణాళిక ప్రకారం, కన్యత్వం గురించి పరీక్షలు చేయడం, చర్చించడం.. స్త్రీ జననేంద్రియాలపై వేలి పరీక్షలతో సహా అశాస్త్రీయమైనది, అమానవీయం, వివక్షత లేని పనులని పేర్కొంది. ఈ పరీక్షల అశాస్త్రీయ ప్రాతిపదిక గురించి కోర్టులను ఎలా ఆశ్రయించాలో విద్యార్థులకు పాఠాలు నేర్పించాలని తెలిపింది. ఫెటిషిజం, ట్రాన్స్‌వెస్టిజం, వోయూరిజం, శాడిజం, నెక్రోఫాగియా, మసోకిజం, ఎగ్జిబిషనిజం, ఫ్రాట్యురిజం మరియు నెక్రోఫిలియా వంటి అంశాలను కూడా నేరాల నుంచి తీసివేసింది. సెప్టెంబర్ 5న సోడోమీ, లెస్బియానిజాన్ని అసహజ లైంగిక నేరాలుగా పరిగణిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను నేషనల్ మెడికల్ కమిషన్ పసంహరించుకుంది. 2022లో మద్రాసు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీటిని తీసివేశారు.