ఈ ప్రయోగాలే కాకుండా నాసా(NASA) ఎక్లిప్స్ మెగామూవీ అనే మరో ఆసక్తికర ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం నాసా, గ్రహణాన్ని వీక్షించే వారికి ఓ విజ్ఞప్తి చేసింది. గ్రహణం ఏర్పడినప్పుడు ఫోటోలు(Photos) తీసి, తమకు పంపాలని కోరింది.

గ్రహణాల(eclipses) వల్ల కలిగే మార్పుల అధ్యయనానికి ఇది మంచి అవకాశం. అంతేకాక, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయో కూడా తెలుస్తుంది.

ఈ ప్రయోగాలే కాకుండా నాసా(NASA) ఎక్లిప్స్ మెగామూవీ అనే మరో ఆసక్తికర ప్రయోగాన్ని కూడా చేపట్టనుంది. ఈ ప్రయోగం కోసం నాసా, గ్రహణాన్ని వీక్షించే వారికి ఓ విజ్ఞప్తి చేసింది. గ్రహణం ఏర్పడినప్పుడు ఫోటోలు(Photos) తీసి, తమకు పంపాలని కోరింది. అలా ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల నుంచి వచ్చే ఫోటోలన్నింటినీ కలిపి, కృత్రిమ మేధ (AI) సాయంతో విశ్లేషణ చేయనుంది. ఈ ఫొటోలతో సూర్యుడి కరోనాకు(Carona) సంబంధించి మరింత వివరంగా తెలుస్తుంది. కరోనా అంటే సూర్యుడి చుట్టూ పలు రకాల వాయువులతో ఏర్పడిన వాతావరణం. సాధారణంగా సూర్యుడిపై ఉండే తీవ్రమైన కాంతి వల్ల ఈ కరోనా కనిపించదు. దానిని చూసేందుకు ప్రత్యేకమైన పరికరాలు కావాలి. అయితే, గ్రహణాల సమయంలో దీనిని సులభంగా చూడొచ్చు. అంతేకాదు, సూర్యుడికి అతి సమీపంలో ఉన్న నక్షత్రాలను కూడా చూడొచ్చు. ఈ ఫోటోల ద్వారా వాటిపై కూడా అధ్యయనం చేయడం ఈ ప్రయోగంలో మరో ముఖ్య లక్ష్యం.

Updated On 8 April 2024 12:34 AM GMT
Ehatv

Ehatv

Next Story