మేకప్‌తో(Makeup) అందమైతే వస్తుంది కానీ.. అది తాత్కాలికంగానే ఉంటుంది. అదే అందం శాశ్వతంగా ఉండాలంటే.. ముందు కొన్ని విషయాలను నిత్యం దృష్టిలో ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా రూపురేఖలు, శరీర ఆకృతితో పాటు చర్మం(Skin) సురక్షితంగా ఉందా? లేదా? ఆరోగ్యవంతంగా ఉందా? లే దా? అనేది ప్రతిసారి గమనించుకుంటూ ఉండాలి

మేకప్‌తో(Makeup) అందమైతే వస్తుంది కానీ.. అది తాత్కాలికంగానే ఉంటుంది. అదే అందం శాశ్వతంగా ఉండాలంటే.. ముందు కొన్ని విషయాలను నిత్యం దృష్టిలో ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా రూపురేఖలు, శరీర ఆకృతితో పాటు చర్మం(Skin) సురక్షితంగా ఉందా? లేదా? ఆరోగ్యవంతంగా ఉందా? లే దా? అనేది ప్రతిసారి గమనించుకుంటూ ఉండాలి. లేదంటే.. పాడైన చర్మానికి ఎన్ని రంగులు పూసినా.. అది సహజసిద్ధంగా అనిపించదు. మరింకెందుకు ఆలస్యం మీరు చర్మసంరక్షణలో(skin care) ఎలాంటి పొరబాట్లు చేస్తున్నారో చూడండి.

రెండు సార్లు కంటే ఎక్కువ వద్దు..
సాధారణంగా ముఖం మెరవాలంటే.. సబ్బుతోనో(soap), ఫేస్‌ వాష్‌తోనో(Face wash) బాగా తోమి, కడుక్కోవాల్సిందే అనుకుంటాం మనం అంతా. కానీ అలా పదేపదే క్లీన్‌ చేసుకోవడం వల్ల సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్స్‌(Oils) పూర్తిగా పోతాయి. నిత్యం ఎక్కువ కెమికల్స్‌ ఉన్న ప్రొడక్ట్స్‌ని(Products) వాడటం వల్ల ఉత్పత్తి శక్తి కోల్పోయి.. చర్మం బిరుసుగా, పొడిబారినట్లుగా మారిపోతుంది. అందుకే జాగ్రత్తలు తప్పవు. రోజుకి రెండు సార్లు మాత్రమే ముఖం కడుకోవాలి. అత్యవసరం అయితే.. చల్లటినీళ్లతో అప్పుడప్పుడూ కడుక్కోవడం మంచిదే.

గిల్లితే మచ్చే
ఇక తినే ఆయిల్‌ ఫుడ్స్‌ కారణంగానో.. వయసు ప్రభావంతోనో.. ముఖంపై మొటిమలు(Pimples).. పొక్కులు రావడం సహజంగా జరుగుతుంది. అయితే వాటిని త్వరగా తగ్గించుకోవాలనే ఉద్దేశంతో గిల్లడం, పదే పదే తాకడం ఏమాత్రం మంచిది కాదు. అవి పెద్దగా అవ్వడంతో పాటు మచ్చలు పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అలా అస్సలు చేయొద్దు
మచ్చలే కాదు చాలా మందికి ముఖంపై నూగు ఉంటే కూడా నచ్చదు. అందుకే అవాంచిత రోమాలను తొలగించుకునే లేజర్స్, వాక్స్‌ స్ట్రిప్స్‌ లాంటివి ముఖంపై వాడి.. ముఖాన్ని నీట్‌గా చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దానివల్ల చర్మం లూజవుతుంది. వయసు మీద పడినట్లుగా స్కిన్‌ త్వరగా ముడతలుపడుతుంది. వీలుంటే ప్రొఫెషనల్‌ పార్లర్స్‌లో వాక్సింగ్, థెడ్డింగ్‌ లాంటివి చేయించుకోవాలి. లేదంటే పసుపు, శనగపిండి వంటి.. వంటింటి చిట్కాలను క్రమం తప్పకుండా వాడుతూ.. ముఖంపైన పేరుకున్న నూగుని తొలగించుకోవాలి.

తప్పకుండా పాటించాల్సినవి
బయటికి వెళ్తున్నప్పుడు స¯Œ స్క్రీన్‌ లోషన్స్‌ వాడటం, కాలానికి తగ్గట్టుగా సాంద్రత తక్కువగా ఉండే లోషన్స్‌ వాడటం.. చాలా ముఖ్యం. ఫేస్‌కి ఏ మాస్క్‌ వేసినా.. ఏ మసాజ్‌ చేసినా.. అదే చేత్తో మెడను కింద నుంచి పైకి మర్దనా చేసుకోవడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల.. ఫేస్‌ స్కిన్‌కి, నెక్‌ స్కిన్‌కి వేరియేషన్‌ పోయి... అంతా ఒకేలా, అందంగా కనిపిస్తుంది.

అసలు వద్దంటే వద్దు
మీరు కానీ ఫాస్ట్‌ ఫుడ్‌ లవరా? డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతారా? షుగర్‌ ఐటమ్స్‌ ఎక్కువగా తింటారా? అయితే ఇక నుంచి వాటికి గుడ్‌ బై చెప్పెయ్యండి. ఎందుకంటే అవన్నీ స్కిన్‌ ప్రాబ్లమ్స్‌కి కారణమయ్యే పదార్థాలే. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి. వాటిల్లోని ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా అంది.. స్కిన్‌ సాఫ్ట్‌గా తయారవుతుంది.

నిద్ర నీళ్లు ఉంటే చాలు
నిజానికి నిగారించే చర్మానికి నిద్ర నీళ్లు ఉంటే చాలు అంటారు నిపుణులు. మంచి నిద్ర.. ఎలాంటి సమస్యలనైనా దూరం చేస్తుంది. సెల్‌ టర్నోవర్‌ని సాధారణ స్థాయిలో ఉంచుతుంది. నిద్ర సరిగా లేకపోతే కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గి చర్మం దెబ్బతిని ముడతలు పడుతుంది.. అందుకే కనీసం 6 లేదా 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగితే.. శరీరంలో కొత్త మెరుపు రావడం ఖాయం.

గమనిక: ఇవన్నీ నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. అయితే ఇది కేవలం మీ అవగాహన కోసమే. తీవ్రమైన సమస్యలకు వైద్యపర్యవేక్షణ తపనిసరి. గమనించగలరు.

Updated On 13 April 2023 11:26 PM GMT
Ehatv

Ehatv

Next Story