సాధారణంగా చాలా మంది బరువు తగ్గడం కోసం రాత్రిళ్లు భోజనం మానేస్తుంటారు. మరికొందరు మాత్రం ఎక్కువగా తినేస్తుంటారు. ఈరెండు పద్దతులు ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. రాత్రి భోజనం మన జీవనశైలిలో అత్యంత ముఖ్యం. ఎందుకంటే శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా.. శక్తిని అందిస్తుంది. కానీ తరచూ ప్రజలు రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా పొరపాట్లు చేస్తుంటారు. దీంతో అనారోగ్యానికి గురవుతుంటారు. అంతేకాకుండా..

సాధారణంగా చాలా మంది బరువు తగ్గడం కోసం రాత్రిళ్లు భోజనం మానేస్తుంటారు. మరికొందరు మాత్రం ఎక్కువగా తినేస్తుంటారు. ఈరెండు పద్దతులు ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు.. రాత్రి భోజనం మన జీవనశైలిలో అత్యంత ముఖ్యం. ఎందుకంటే శరీరానికి పోషకాలు అందించడమే కాకుండా.. శక్తిని అందిస్తుంది. కానీ తరచూ ప్రజలు రాత్రి భోజనం చేసిన తర్వాత చాలా పొరపాట్లు చేస్తుంటారు. దీంతో అనారోగ్యానికి గురవుతుంటారు. అంతేకాకుండా.. బరువు పెరగడం.. పొట్ట రావడం, ఉదయాన్నే బద్ధకంగా ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే నిద్ర పోయే ముందుc.. భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు అస్సలు చేయకుడదు. పొరపాటున రాత్రి తిన్న తర్వాత కొన్ని పనులు చేయడం వలన అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి.

ఈ పనులు చేయకండి..
అతిగా తినకండి.. రాత్రిపూట ఎక్కువగా ఆహారం తీసుకోవద్దు. అతిగా తినడం వల్ల అజీర్ణం, బరువు పెరగడం, పొట్ట రావడమే కాకుండా.. ఇతర వ్యాధులు వస్తాయి.

మద్యం సేవించవద్దు.. భోజనం చేసిన తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వస్తుంది.

ధూమపానం.. రాత్రి భోజనం తర్వాత ధూమపానం చేయకూడదు. క్యాన్సర్, గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

రాత్రి పడుకునే ముందు ఈ పనులు చేయండి..
నడవడం..
తిన్న తర్వాత కాసేపు నడవడం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తక్కువ. జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాలపాటు నడవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు.

పండ్లు తినడం..
చాలా మందికి ఆహారం తిన్న తర్వాత స్వీట్స్ తినాలని అనిపిస్తుంది. అలాంటి సమయంలో పండ్లు తీసుకోవడం ఉత్తమం. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. తీపి ఆహారం తినాలనే కోరికతో పండ్లను తీసుకునేవారు వేగంగా బరువు తగ్గుతారనే ఓ అధ్యయనంలో తేలింది.

వెంటనే నిద్రపోవద్దు..
భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం చాలా మందికి అలవాటు. కానీ ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయకూడదు. తిన్న వెంటనే పడుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్... గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే తిన్న తర్వాత గంట తర్వాత మాత్రమే నిద్రపోయేలా అలవాటు చేసుకోవడం ఉత్తమం.

నీరు తీసుకోవడం..
ఆహారం తీసుకున్న కొంత సమయం తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రచురించబడిన ఓ అధ్యయనంలో భోజనం చేసిన తర్వాత నీరు తాగడం వలన పేగు కదలికలు మెరుగుపడతాయని తేలింది.

Updated On 5 Jun 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story