ఆరోగ్యానికి నడక మంచిది ...నడక అనేది సింపుల్ ఎక్సర్​సైజ్. రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలన్న...బాడీ ఆక్టివ్ గా ఉండాలన్న వాకింగ్‌ తప్పనిసరి.. వాకింగ్ వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు కండరాలను దృఢంగా మారుతుంది . వాకింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే డాక్టర్లు మనకు రోజుకి కనీసం అరగంట సేపు వాకింగ్ చేయమని చెబుతూ ఉంటారు. అ ప్రయోజనాలు ఏంటో పుడు చూద్దా౦. శరీరం యాక్టివ్‌గా ఉండాలన్నా, ఎన్నో రకాల వ్యాధులు అటాక్ […]

ఆరోగ్యానికి నడక మంచిది ...నడక అనేది సింపుల్ ఎక్సర్​సైజ్. రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలన్న...బాడీ ఆక్టివ్ గా ఉండాలన్న వాకింగ్‌ తప్పనిసరి.. వాకింగ్ వల్ల ఒత్తిడి తగ్గడమే కాదు కండరాలను దృఢంగా మారుతుంది . వాకింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. అందుకే డాక్టర్లు మనకు రోజుకి కనీసం అరగంట సేపు వాకింగ్ చేయమని చెబుతూ ఉంటారు. అ ప్రయోజనాలు ఏంటో పుడు చూద్దా౦.

శరీరం యాక్టివ్‌గా ఉండాలన్నా, ఎన్నో రకాల వ్యాధులు అటాక్ చేయకూడదు అంటే వాకింగ్‌ తప్పనిసరిగా చెయాలిసిందే . కేవలం 10 నిమిషాలు వేగంగా నడిచిన చాలు మన మెదడు చురుగ్గా మారుతుంది. కండరాలు బలోపేతమవుతాయి. ఉదయాన్నే సూర్యరశ్మి ఒంటికి తగిలితే ఎంతో మంచిది. దీనివల్ల శరీరానికి డి విటమిన్‌ అందుతుంది. ఉదయం నడక మన జీవక్రియను మెరుగుపరుస్తుంది.

షుగర్‌తో బాధపడుతున్న వారికి వాకింగ్‌ ఓ వరం లాంటిది అనే చెప్పాలి. ప్రతి రోజూ తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు నడిస్తే రక్తంలో షుగర్‌ స్థాయి నియంత్రణలో ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.
వాకింగ్‌ వల్ల కాళ్లు, పొట్ట భాగంలోని కండరాలు బలోపేతం అవుతాయి. ఆర్థిరిటిస్‌తో బాధపడేవాళ్లకు నడక ఎంతో మేలు చేస్తుంది.

శారీరక శ్రమ వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది గుండెను బలోపేతం చేస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగై శరీరంలో వివిధ భాగాలకు ఎక్కువ ఆక్సిజన్‌ అందుతుంది. ఎంత పని ఒత్తిడిలో వున్నా.. మీ సమయంలో ఉన్న అరగంట సమయాన్ని వాకింగ్‌కి వెచ్చిస్తే చాలా మంచిది. వాకింగ్ చేయడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నిజంగా వాకింగ్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టొచ్చు. కాబట్టి రెగ్యులర్‌గా ఎంత పనిలో ఉన్నా సరే అరగంట సేపు వాకింగ్ కోసం మీ సమయాన్ని వెచ్చించండి. వాకింగ్‌ వల్ల మన మెదడు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడి, బాధను తగ్గించేలా చేస్తాయి. ఫలితంగా మనం ఆనందంగా ఉంటాం.

ఒక్కొక్క సారి బయటికి వెళ్లి వాకింగ్ చేయడం కుదరకపోవచ్చు. అటువంటి సమయంలో బాల్కనీలో కానీ మేడ మీద కానీ వాకింగ్ చేసుకోవచ్చు. ఎలా వాకింగ్ చేసినా ప్రయోజనం వుంటుంది. వాకింగ్ అనేది ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే కాదు . ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అందుకే వాకింగ్ కోసం కాస్త టైం స్పెండ్ చేసి రెగ్యులర్‌గా వాక్ చేస్తూ ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ....లైఫ్ లాంగ్ ఆరోగ్యం గా , సంతోషం గా ఉండవచ్చు.

Updated On 25 Feb 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story