ఉరుకుల ప‌రుగుల ఈ జీవితంలో చాలా మంది రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. రక్తపోటు విషయానికి వస్తే.. అధిక బిపి అంటే హైపర్‌టెన్షన్ గురించి ఎక్కువ‌గా వింటాం.

ఉరుకుల ప‌రుగుల ఈ జీవితంలో చాలా మంది రక్తపోటు సమస్యకు గురవుతున్నారు. రక్తపోటు విషయానికి వస్తే.. అధిక బిపి అంటే హైపర్‌టెన్షన్ గురించి ఎక్కువ‌గా వింటాం. తక్కువ రక్తపోటు(లో బీపీ) తరచుగా విన‌ప‌డుతుంది. ఎందుకంటే Low BP లక్షణాలు అంత స్పష్టంగా కనిపించవు. అలాగే ప్రజలు అధిక రక్తపోటు కంటే Low BP తక్కువ ప్రమాదకరమైనదిగా భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ.. హైపోటెన్షన్ అని కూడా పిలువబడే Low BP ఈ రోజుల్లో ఆరోగ్య‌ సమస్యగా మారింది.

రక్తపోటు సాధారణ రక్తపోటు పరిధి 120/80 మిమీ కంటే తక్కువగా ఉండి.. 90/60 కంటే తక్కువకు వెళ్లడం ప్రారంభిస్తే దానిని హైపోటెన్షన్ అంటారు. దీనిని నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పోషకాహార లోపం, తీవ్రమైన ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్, ఒత్తిడి, హైపోథైరాయిడిజం, రక్తహీనత లేదా రక్త పరిమాణం తగ్గడం, గర్భం, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిలో Low BPకి గుర‌వుతుంటారు. BP తక్కువగా ఉన్నప్పుడు.. తల తిరగడం, అపస్మారక స్థితి, అస్పష్టమైన దృష్టి, దాహం వేయ‌డం, వాంతులుచ‌ వికారంచ‌ అలసట వంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి.

మీకు అకస్మాత్తుగా మీ రక్తపోటు తగ్గుతున్నట్లు అనిపిస్తే.. ఇంటి వ‌ద్ద చిన్న చిన్న నివారణ ప‌ద్ధ‌తుల‌ సహాయంతో తక్షణ ఉపశమనం పొందవచ్చు.

ఉప్పు నీరు

ఉప్పు నీరు తాగడం వల్ల తక్కువ రక్తపోటును సమతుల్యం చేస్తుంది. WHO ప్రకారం.. ఒక రోజులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పును మించకూడదు.. కానీ తక్కువ రక్తపోటు ఉంటే కొంచెం ఎక్కువ తీసుకునే అవసరం ఉంటుంది. నీటిలో ఉప్పు వేసి కరిగించి తాగడం వ‌ల‌న‌ తక్షణ ఉపశమనం కలుగుతుంది. రక్తం పరిమాణం పెంచడం ద్వారా నీరు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది డీహైడ్రేషన్ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

తులసి నీరు

పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి.. తులసి ఆకులలో లభిస్తాయి. యూజినాల్ అనే యాంటీఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అందుచేత కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని సేవించాలి.

కిస్ మిస్‌

ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. ఇది రక్త ప్రసరణను సజావుగా క్రమబద్ధీకరిస్తుంది, తద్వారా రక్తపోటును నియంత్రిస్తుంది.

విటమిన్ B12 రిచ్ డైట్

విటమిన్ B12, ఫోలేట్ యొక్క లోపం రక్తహీనతకు కారణమవుతుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది. కాబట్టి మీ ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, పాలు, జున్ను వంటి పదార్థాలను తీసుకోండి. ఆకుకూరలు, బ్రోకలీ, కాయధాన్యాలు, సిట్రస్ పండ్లు, గింజలు, విత్తనాలను కూడా తీసుకోవాలి. ఇవి శరీరానికి విటమిన్ బి 12, ఫోలేట్‌ను తగిన మొత్తంలో అందిస్తాయి.

కెఫిన్

టీ, కాఫీ తాత్కాలికంగా రక్తపోటును పెంచుతాయి. అయితే దీనిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.

Disclaimer : పై వ్యాసంలో పేర్కొన్న సలహాలు, సూచనలు సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే.. వృత్తిపరమైన వైద్య సలహాగా తీసుకోకూడదు. మీకు ఏవైనా ప్రశ్నలు లేదా ఎటువంటి ఆందోళనలు ఉన్నా వెంట‌నే వైద్యుడిని సంప్రదించండి.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story