నిండు నూరేళ్లు బతకడం చాలా ఈజీ అని సంచలన ప్రకటన చేశారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించండి అంటూ పెద్దలు ఆశీర్వదించడం తరుచూ మనం చూస్తూనే ఉంటాం. ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లతో వందేళ్లు బతకడం ఇప్పుడు అంత సులువు కాదు
నిండు నూరేళ్లు బతకడం చాలా ఈజీ అని సంచలన ప్రకటన చేశారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించండి అంటూ పెద్దలు ఆశీర్వదించడం తరుచూ మనం చూస్తూనే ఉంటాం. ఆరోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లతో వందేళ్లు బతకడం ఇప్పుడు అంత సులువు కాదు. అయితే.. వందేళ్లు బతకడం పెద్ద కష్టమైన విషయం కాదని.. రానున్న రోజుల్లో అది చాలా ఈజీగా మారుతుందని చెబుతున్నారు ప్రపంచ ప్రఖ్యాత బయాలజిస్టు కం ఇన్ స్టిట్యూట్ ఫర్ సిస్టమ్ బయాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్ లెరోయ్ హుడ్(Leroy Hood).
డాక్టర్ లెరోయ్ హైదరాబాద్ వచ్చారు. మరో పదేళ్లలో వైద్య రంగంలో(Medicine Department) భారీగా మార్పులు వస్తాయని, తద్వారా వందేళ్లు ఈజీగా బతికేయేచ్చని తెలిపారు.హైదరాబాద్‌లోని గచ్చిబౌలి(Gachibowli) ఏఐజీ ఆసుపత్రి(AIG Hospital) ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు(Dr.Nageswar Rao) తండ్రి, వైద్యుడు డాక్టర్ డి. భాస్కర్‌రెడ్డి(Bhaskar Reddy) స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లెరోయ్ హుడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుట్టిన తేదీ ప్రకారం వయసు ముఖ్యం కాదని.. జీవ సంబంధమైన బయోలాజికల్ వయస్సు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. బయోలాజికల్ వయసు అనేది జన్యువులు.. జీర్ణకోశ ఆరోగ్యం, వ్యాయామం, నిద్ర, ఇతర అలవాట్లపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని రకాల రక్త పరీక్షలతో ప్రతి వ్యక్తి బయోలాజికల్ వయసును నిర్దారించే దిశగా ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని.. క్రోనలాజికల్ ఏజ్ కంటే బయోలాజికల్ వయసు తక్కువగా ఉండాలన్నారు. తాజాగా జరుగుతున్న పరిశోధనలతో బయోలాజికల్ వయస్సును తగ్గించడం ద్వారా ఆయుష్షు పెంచడం. నిండు నూరేళ్లు బతికేలా చేయొచ్చని డాక్టర్ లెరోయ్ తెలిపారు. వచ్చే పదేళ్లలో వైద్య చికిత్సలో భారీగా మార్పులు వస్తాయని చెప్పారు. పెద్ద వయసు సమస్యలతో పాటు షుగర్, క్యాన్సర్, అల్జీమర్స్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ముందే తెలుసుకోవచ్చన్నారు. మరో కీలక విషయాన్ని వెల్లడించారు. అధిక బరువు, ఉబకాయంతో బాధ పడుతున్నారా? లేదా అన్న దానిపై ఇప్పటివరకు వేస్తున్న లెక్కల్లో నిజం లేదని చెప్పడం గమనార్హం. వయసు, బరువుతో బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా.. ఒక వ్యక్తి అధిక బరువుతో ఉన్నారా? లేదా? అన్నది చెప్తున్నారని, కానీ ఇది సరైన లెక్క కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంచి కొవ్వు.. కండ పుష్టి ఉండి బరువు ఉంటే అది ఊబకాయంగా భావించకూడదని చెప్పారు. మెటబాలిక్ బీఎంఐను మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న లేరోయ్. ప్రతి వ్యక్తికి మెదడు, ఆరోగ్యం కీలకమన్నారు. నడిచేటప్పుడు అటు, ఇటు పరిశీలించాలని.. ఫజిల్స్ నింపడం, గుర్తులు నెమరవేసుకోవడంలాంటి వాటి ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చని తెలిపారు.