వేసవి కాలం వచ్చింది. చల్లగా ఉండటం కోసం..వేడిమి నుంచి బయట పడటం కోసం.. మనం వాడే కూరగాయల నుంచి కొన్ని సెలక్ట్ చేసుకుని.. శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు.. అందులో ముఖ్యంగా కీరా(Kira), సబ్జా(Subja), చెరకురసంతో(Sugar cane juice) పాటు.. విరివిగా వాడే నిమ్మ ను సమ్మర్ లో ఎక్కువగా వాడాల్సి ఉంటుంది.

వేసవి కాలం వచ్చింది. చల్లగా ఉండటం కోసం..వేడిమి నుంచి బయట పడటం కోసం.. మనం వాడే కూరగాయల నుంచి కొన్ని సెలక్ట్ చేసుకుని.. శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు.. అందులో ముఖ్యంగా కీరా(Kira), సబ్జా(Subja), చెరకురసంతో(Sugar cane juice) పాటు.. విరివిగా వాడే నిమ్మ ను సమ్మర్ లో ఎక్కువగా వాడాల్సి ఉంటుంది.

నిమ్మకాయలో(Lemon) సుగుణాలుతెలిస్తే.. దాన్ని అంత తేలికగా వదిలిపెట్టారు. నిమ్మను శరీరం లోపలా.. శరీరం బయట రెండు రకాలుగా వాడి.. అటు రోగాల నుంచి.. ఇటు వేడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరి నిమ్మతో ఉపయోగాలు ఏంటీ.. ఎలా వాడవచ్చు.. చూద్దాం..

నిమ్మరసం కడుపుకు చాలా మంచిది. జీర్ణశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగితే అజీర్ణం, పైత్యం తగ్గుతాయి.. తలతిరుగుడు లాంటివాటికి కూడా ఇది విరుగుడులా పనిచేస్తుంది.

నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కడుపులోని చెడుక్రిములను నాశనం చేస్తుంది అందుకే నిమ్మరసం తాగితే కడుపు చల్లబడి.. శరీరం రిలాక్స్ అవుతుంది. హాయిగా నిద్ర కూడా పడుతుంది.

జ్వరంగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగితే జ్వరం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా వేసవికాలం.. బాగా ఎండగా ఉన్నప్పుడు శరీరంలో ఉన్న తేమ కోల్పోయి .. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది.

అందుకే ఎండలో పనిచేసినా.. ఎండకు ప్రయాణాలు చేసినా.. దానికి ముందు.. ఆతరువాత నిమ్మరసం తాగడానికి ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.

ఇక నిమ్మ తక్షణ శక్తి కారకంగా పనిచేస్తుంది. తినకుండా బయటకు వెళ్లినప్పుడు నిమ్మరసం తాగితే.. అది నీరసం రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. తక్షణ శక్తిని ఇచ్చి.. కళ్లు తిరుగుడు నుంచి కాపాడుతుంది.

ఇక నిమ్మ శరీరంలోపలే కాదు..బయట కూడా బాగా పనిచేస్తుంది. వంటికి నిమ్మ చక్కలతో మర్ధనా చేసుకుంటే.. శరీరంపై మురికి తొలగిపోతుంది.

నిమ్మను జుట్టుకు పెట్టుకుంటే చుండ్రుబాధ తొలగిపోతుంది.. జుట్టు నిగనిగలాడుతుంది. జుట్టుకు సబంధించి.. చుండ్రకు సంబంధిచిన రకరకాల సమస్యల నుంచి నిమ్మ రక్షణ ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నిమ్మ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ వేసవిలో నిమ్మకాయలు మీ వంటింట్లో ఉండేట్టు చూసుకోండి మరి.

Updated On 9 April 2023 11:40 PM GMT
Ehatv

Ehatv

Next Story