సాధారణంగా ఓ మహిళకు ఒకే గర్భాశయం(Womb) ఉంటుంది. రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదు. రెండు గర్భాశయాలు ఉంటే ప్రసవ(Delivery) సమయంలో చాలా రిస్క్‌ ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. సపోజ్‌ రెండు గర్భాశయాలు ఉన్నాయే అనుకుందాం! రెండింటిలో శిశువులు పెరగడం అన్నది జరగదు.

సాధారణంగా ఓ మహిళకు ఒకే గర్భాశయం(Womb) ఉంటుంది. రెండు గర్భాశయాలు ఉండటం అత్యంత అరుదు. రెండు గర్భాశయాలు ఉంటే ప్రసవ(Delivery) సమయంలో చాలా రిస్క్‌ ఉంటుందని వైద్యులు చెబుతుంటారు. సపోజ్‌ రెండు గర్భాశయాలు ఉన్నాయే అనుకుందాం! రెండింటిలో శిశువులు పెరగడం అన్నది జరగదు. కానీ అలబామాకు(Alabama) చెందిన ఓ మహిళకు ఇది జరిగింది. దక్షిణ అమెరికాలోని(america) అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్‌(Kelsey Hatcher), కాలేబ్‌(Caleb) దంపతులకు ముగ్గురు పిల్లలు. ఆమె మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి మాత్రం ఒకే సమయంలో రెండుసార్లు గర్భందాల్చింది(dual Pregnancy). అదే విచిత్రం. అసలు ఇది ఎలా సాధ్యమయ్యిందన్నది డాక్టర్లకు కూడా అంతుపట్టడం లేదు. ఆమెకు రెండు గర్భాశయాలు ఉన్నట్టు వైద్యులు ఇది వరకే ఆమెకు చెప్పారు. రెండు గర్భాశయాలలో దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒక గర్భాశయంలో ఇద్దరు ఉంటే కవలలని(Twins) అంటాం. మరి వేర్వేరు గర్భాశయాలలో పిండాలు పెరుగుతున్నప్పుడు ఏమనాలి? కవలలే అనాలా? లేకపోతే కొత్తగా ఏదైనా పదాన్ని కనిపెట్టాలా? ఇలాంటివి అత్యంత అరుదుగా జరుగుతాయని కెల్సీ హాట్చర్‌కు వైద్యం అందిస్తున్న గైనకాలజిస్టు డాక్టర్‌ శ్వేతా పటేల్‌ అంటున్నారు. రెండు గర్భాశయాలు ఉన్న మహిళలు ప్రెగ్నెంట్‌ అయినా తరుచుగా గర్భస్రావం అవ్వడమో, లేకపోతే నెలలు నిండకుండానే ప్రసవం కావడమో జరుగుతుంటుందని కాన్పుల నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ డేవిస్‌ అంటున్నారు. ప్రతి వెయ్యి మంది మహిళలలో ముగ్గురికి ఇలా రెండేసి గర్భాశయాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం తాము కెల్సీ హాట్చర్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నామని చెప్పారు. ఇద్దరు శిశువులు బాగున్నారని ఇప్పుడైతే తాము భరోసా ఇవ్వలేమని శ్వేతా పటేల్‌ చెబుతున్నారు.

Updated On 14 Nov 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story