దక్షిణ భారతదేశంలో ఇడ్లీ ముఖ్యమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇష్టమైన ఆహారం.

దక్షిణ భారతదేశంలో ఇడ్లీ ముఖ్యమైన ఆహారం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఇష్టమైన ఆహారం. పేద, ధనిక అనే తేడా లేకుండా, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇడ్లీని కలిపి తినడానికి ఇష్టపడతారు. ఇడ్లీకి సాంబర్‌ ఉంటే రుచి అదనం. ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్‌ను అందించే ఈ ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అంతేకాదు, ఇడ్లీని తయారు చేయడానికి నూనె లేదా ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. బెంగళూరు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన నివేదికతో ఇడ్లీపై కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇడ్లీలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు అధికారులు నివేదిక ఇవ్వడంతో ఇడ్లీ ప్రియులు షాక్‌కు గురయ్యారు. బెంగళూరు ఆరోగ్య శాఖ అధికారులు నగరంలోని హోటళ్లు ,వీధి వ్యాపారులు ఇడ్లీలను ఎలా తయారుచేస్తున్నారో అధ్యయనం చేవారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి ఇడ్లీ నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. ఈ పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనేక ఇడ్లీ నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. దాదాపు 500 ఇడ్లీ నమూనాలను పరిశీలించిన ఆరోగ్య శాఖ, వాటిలో 35 నమూనాలలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని నిర్ధారించింది. ఈ రసాయనాలు వినియోగదారులలో క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వందలాది నమూనాల పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. అసలు ఇడ్లీలో క్యాన్సర్‌ కారకాలు ఎలా వస్తున్నాయని పరిశీలించగా ఇడ్లీ పిండిని శుభ్రమైన కాటన్ వస్త్రాలపై వేసి, ఆపై ఇడ్లీ ట్రేలపై పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. కానీ, చాలా హోటళ్లు , వీధి వ్యాపారులు ఇప్పుడు కాటన్ వస్త్రాలకు బదులుగా ప్లాస్టిక్ షీట్లతో ఇడ్లీని తయారుచేస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, అధిక వేడికి ప్లాస్టిక్ గురైనప్పుడు రసాయనాలను విడుదల చేస్తుందని.. ఈ రసాయనాలలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఇడ్లీలలో క్యాన్సర్ కారకాలు కనుగొనబడ్డాయని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఇడ్లీ తయారీ విధానంపై స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని అధికారులు చెప్తున్నారు.

ehatv

ehatv

Next Story