మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు.

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న కొడాలి నాని(Kodali Nani).. హార్ట్ సర్జరీ కోసం ముంబై(Mumbai) ఆసుపత్రిలో చేరారు. కాగా..ఆయనకు డాక్టర్లు బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రముఖ డాక్టర్ పాండ కొడాలి నానికి సర్జరీ చేసారు ఈ ఆపరేషన్ విజయవంతం అయింది డాక్టర్ల బృందం తెలిపింది.. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మరో మూడు రోజుల పాటు అబ్సర్వేషన్ లో ఉంచుతామని తెలిపారు.
తన మిత్రుడి ఆరోగ్యంపై సినీ నటుడు ఎన్టీఆర్ (Jr NTR)దిగ్బ్రాంతి వ్యంక్తం చేసారు.. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని అయన తెలిపారు. నాని కుటుంబసభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. దిగులు పడవద్దని త్వరలోనే మళ్లీ మాములు మనిషిలా అవుతాడని కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ దైర్యం చెప్పారు.. ఇక నాని, ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం గురించి మనకు తెలిసింది.. ఎన్నో ఏళ్ళ నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. ఒక విధంగా కొడాలి నాని రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ కారణమని అందరు చెప్తుంటారు.
