ఆహార(Food) పదార్థాల ద్వారా అనేక రకాల హానికరమైన రసాయనాలు(Chemicals) శరీరంలోకి(Body) రోజూ ప్రవేశిస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది.

ఆహార(Food) పదార్థాల ద్వారా అనేక రకాల హానికరమైన రసాయనాలు(Chemicals) శరీరంలోకి(Body) రోజూ ప్రవేశిస్తున్నాయని ఓ అధ్యయనం తెలిపింది. రసాయనాలు, మైక్రోప్లాస్టిక్‌లు(Micro plastic) ప్రధానంగా ప్లాస్టిక్ సంచులు(Plastic bags), సీసాలు, కంటైనర్లు, ప్యాక్ చేసిన ఆహారాన్ని కలిగి ఉన్న ప్లాస్టిక్ సంచుల ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. వీటిలో చాలా వరకు క్యాన్సర్, శాశ్వత జన్యు మార్పులు, పునరుత్పత్తి వ్యవస్థలో ఆటంకాలు, శరీరం విషపూరితం అవుతుందని పరిశోధకలు చెప్తున్నారు.

ఇప్పటికే 14 వేల కంటే ఎక్కువ రసాయనాలను గుర్తించారు. జర్నల్ ఆఫ్ ఎక్స్‌పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంటల్(Journal of exposure and environment) ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఆహారంతో సంబంధం ఉన్న 14 వేల కంటే ఎక్కువ విభిన్న రసాయనాలు, సమ్మేళనాలను గుర్తించారు. వాటిలో దాదాపు 3,601 మానవ శరీరంలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇది ఫుడ్ కాంటాక్ట్ కెమికల్స్ (FCC)లో 25 శాతంగా పరిగణించబడుతుంది. ఈ రసాయనాలలో చాలా వరకు మన శరీరానికి ఎలా హాని కలిగిస్తాయి అనే దాని గురించి పెద్దగా తెలియడం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తెలిసిన చాలా రసాయనాలు క్యాన్సర్, పునరుత్పత్తి రుగ్మతలకు కారణమవుతాయి.

ఈ రసాయనాలను ప్రధానంగా కంటైనర్లు, బేబీ బాటిళ్లలో గుర్తించారు. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, కంటైనర్ల ద్వారా శరీరంలోని అనేక రకాల లోహాలు, పురుగుమందులు, అస్థిర సేంద్రియ సమ్మేళనాలను కనుగొన్నారు. ఇవి శ్వాస సమయంలో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇది కాకుండా, ప్లాస్టిక్‌లు, పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగించే థాలేట్స్ రసాయనాలు కూడా హానీ కలిగిస్తాయని చెప్తున్నారు. మానవులలో ఎఫ్‌సీసీని గుర్తించడానికి రక్తం, మూత్రం, చర్మం, తల్లి పాల నమూనాలను పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. వీటిలో చాలా ప్రమాదకరమైన రసయనాలు కలిగి ఉంటాయని ఇవి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే సమస్య. వాటిని నిషేధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Eha Tv

Eha Tv

Next Story