మన వేలితో మన కన్నునే పొడుచుకుంటున్నాం! పచ్చని భూమిని నిలువునా నాశనం చేస్తున్నాం. ఫలితం త్వరలోనే మన అనుభవించబోతున్నాం. భవిష్యత్తు మహా భయంకరంగా ఉండబోతున్నది. అత్యంత కష్టకాలం రాబోతున్నది. కరోనా తర్వాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. రాబోయే రోజుల్లో హీనపక్షం వంద కోట్ల మంది మరణించబోతున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ గండం పొంచి ఉంది.

మన వేలితో మన కన్నునే పొడుచుకుంటున్నాం! పచ్చని భూమిని నిలువునా నాశనం చేస్తున్నాం. ఫలితం త్వరలోనే మన అనుభవించబోతున్నాం. భవిష్యత్తు మహా భయంకరంగా ఉండబోతున్నది. అత్యంత కష్టకాలం రాబోతున్నది. కరోనా తర్వాత వాతావరణ మార్పులు పెను వినాశనాన్ని తీసుకురాబోతున్నాయి. రాబోయే రోజుల్లో హీనపక్షం వంద కోట్ల మంది మరణించబోతున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ గండం పొంచి ఉంది. తాజాగా వాతావరణ మార్పులపై యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ అంటారియో ఓ పరిశోధన చేసింది. అందులో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. భవిష్యత్తులో పెరగబోయే ఉష్ణోగ్రతలు(Temparatures) మనుషుల మరణాలకు ఎలా కారణమవుతాయో తెలిసింది. వాతావరణ మార్పుల కారణంగా ఎంతమంది చనిపోతారన్నది కచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ, వంద కోట్లకు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నామని పరిశోధన నిర్వాహకులు జాషువా పియర్స్‌(Joshua Pierce) హెచ్చరించారు. ఈ గండం నుంచి గట్టెక్కడం మన చేతుల్లోనే ఉందన్నారాయన. మనుషులంతా ముందుగా వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని చెప్పారు. కర్బన ఉద్గారాలను తీవ్రంగా పరిగణించాలని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాల కర్బన్‌ ఉద్గారాల కట్టడికి చర్యలు చేపట్టాలని జాషువా పియర్స్‌ సూచించారు. ఏడాదికేడాది భూతాపం పెరుగుతున్న తీరు చూస్తుంటే భవిష్యతుల్లో భూమి నిప్పుల కొలిమిలా మారడం ఖాయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని వీలైనంత త్వరగా నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. శిలాజ ఇంధనాలు వాతావరణ మార్పునకు ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని దేశాల ప్రభుత్వాలు కార్బన్‌ వేస్ట్ మేనేజ్‌మెంట్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ను సహజంగా నిల్వ చేయడానికి దోహదపడేలా సాంకేతిక అభివృద్ధి చేయాలని సూచించారు.

Updated On 4 Sep 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story