వంటకు వాడే జీలకర్ర(zeera).. సాధారణ పోపు దినుసుగానే చూస్తారు చాలామంది. జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేదే కాని దానిలో ఉండే ఔషద గుణాలు మాత్రం.. పెద్ద పెద్ద మెడిసన్స్(medicines)కు కూడా సాటిరారు.
వంటకు వాడే జీలకర్ర(Jeera).. సాధారణ పోపు దినుసుగానే చూస్తారు చాలామంది. జీలకర్ర అనేది ప్రతి వంటింట్లో ఉండేదే కాని దానిలో ఉండే ఔషద గుణాలు మాత్రం.. పెద్ద పెద్ద మెడిసన్స్(medicines)కు కూడా సాటిరారు. జీలకర్రను ప్రతి కూరల్లో వాడుతుంటారు. జీలకర్ర లేని ఇల్లు అంటూ ఉండదేమో. అయితే జీలకర్ర దినుసుగానే చూసేవారికి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.జీలకర్ర ఎంత మేలు చేస్తుందో తెలిస్తే.. తప్పక వాడుతారు.
జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఏ కాలంలో అయినా ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అందుకే జీలకర్రను నేరుగా కాకుండా.. నీళ్లతో(water) కలిపి తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతుంటారు నిపుణులు.
రోగాలు రాకుండానే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచింది. అందులో జీలకర్ర ఉపయోగపనడుతుంది. గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్(Gastric problems) కు జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుంది. వంట గదిలోనే ఎన్నో పదార్థాలుఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతున్నాయి. వంటింట్లో(kitchen) ఉండే జీలకర్రతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరాన్ని(body) ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర చాలా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ఖాళీ కడుపుతో(empty stomach) జీలకర్ర నీటిని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వివిధ రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శ్వాస కోశ వ్యవస్థపై(breathing system) ఎఫెక్ట్ జీలకర్ర నీరు శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. జీలకర్రతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలున్నప్పటికీ పరిమితంగానే తీసుకోవాలి. ఎక్కువ వాడితే కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
రక్తపోటును కంట్రోల్ జీలకర్ర నీటిలో చాలా పొటాషియం ఉంటుంది. నిత్యం జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది. ముఖ్యంగా జీలకర్రను నీటిలో వేసి వేడి చేసి తీసుకుంటే గుండెకు సబంధిచిన వ్యాధులు కూడా నయం అవుతాయి. అంతే కాదు గ్యాస్ సమస్య నుంచి వెంటనే రిలీఫ్ ఇస్తుంది జీలకర్ర.