కొన్ని నవ్వుల వెనుక విషాద ఛాయలు ఉంటాయి. అవును నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఎందరో కమెడియన్ల కథలు విషాదాలతో ముగిశాయి. మరికొందరిపై విధి పగబట్టినట్టుగా ఏడిపిస్తుంది.
కొన్ని నవ్వుల వెనుక విషాద ఛాయలు ఉంటాయి. అవును నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఎందరో కమెడియన్ల కథలు విషాదాలతో ముగిశాయి. మరికొందరిపై విధి పగబట్టినట్టుగా ఏడిపిస్తుంది. ప్రస్తుతం జబర్థస్త్(Jabardast) కమెడియన్ పంచ్ ప్రసాద్(Punch Prasad) పరిస్థితి అదే.
వరుస పంచ్ ల తో.. గ్యాప్ లేకుండా నవ్వించేవాడు పంచ్ ప్రసాద్. నిలుచున్న చోటే నవ్వుల వాన కురిపిస్తాడు ఈ కమెడియన్. స్టేజ్ పైకి ఎక్కడంటే..నవ్వులు పువ్వులు పూయాల్సిందే. ఇలా నలుగురిని నవ్వించే పంచ్ ప్రసాద్(Punch Prasad) జీవితం విషాదంలో కొట్టుమిట్టాడుతుంది. కిడ్నీ సమస్యతో నరకం చూస్తున్నాడు ప్రసాద్. రెండు కిడ్నీలకు సమస్య రావడంతో ... హాస్పిటల్ చుటూ.. తిరుగుతూ.. లక్షలు ఖర్చు పెడుతూ..డయాలసిస్(Dialysis) చేయించుకుంటున్నాడు.
పంచ్ ప్రసాద్ కు ముందు నుంచి ఓ యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులో తన ఇబ్బందులు..కష్టసుఖాలు పంచుకుంటాడు. ఈక్రమంలో ప్రసాద్ ఆరోగ్యంపై అతని భార్య అప్ డేట్ ఇచ్చింది. ప్రసాద్ మరోసారి హస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందని. డయాలసీస్ నొప్పిని తట్టుకోలేకపోతున్నాడని.. ఇప్పటికే కుడిచేతికి 50 ఇంజక్షన్స్ పడ్డాయని... చెప్పుకొచ్చింది. ఇక పరిస్థితి సీరియస్ అవ్వడంతో సర్జరీ త్వరగా చేయాలన్నారని ఆమె మరో వీడియోలో తెలిపింది.
పంచ్ ప్రసాద్ గొంతు సమస్యతో బాధపడుతున్నారట. పరీక్షలు చేసిన వైద్యులు థైరాయిడ్ సమస్య ఉందని చెప్పారట. అది ఎక్కువ కావడంతో సర్జరీ చేయాలన్నారట. అయితే కాలిలో ఇన్ఫెక్షన్ చేరిందట. అది తగ్గాక మాత్రమే ఆపరేషన్ చేయడానికి వీలవుతుందని చెప్పారట. ఆపరేషన్ అవసరం లేకుండా మందులతో సమస్య తగ్గాలని కోరుకుంటున్నట్లు ఆమె దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధి వలన పంచ్ ప్రసాద్ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. సంపాదనలో ఎక్కువ మొత్తం ట్రీట్మెంట్ కే ఖర్చు అవుతుంది. తోటి జబర్దస్త్ కమెడియన్స్ కొంతలో కొంత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.