శతాబ్దాలుగా మహిళలు బ్రా(BRA) ధరిస్తున్నారు. రొమ్ములు ఆకర్షణీయంగా, బిగుతుగా ఉంచేందుకు ఇవి వాడుతుంటారు.
శతాబ్దాలుగా మహిళలు బ్రా(BRA) ధరిస్తున్నారు. రొమ్ములు ఆకర్షణీయంగా, బిగుతుగా ఉంచేందుకు ఇవి వాడుతుంటారు.
శరీర ఆకృతిని మెయింటెయిన్ చేసుకునేందుకు బ్రాలను ఉపయోగిస్తున్నారు. కానీ బ్రా ధరించడం ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండదు, అలా అని బ్రా ధరించకుండా బయటకు కూడా వెళ్లలేరు. చాలా మంది మహిళలు, అమ్మాయిలు తరచుగా బ్రా ధరించాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు.
బ్రాను ధరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి రొమ్ములకు సహాయంగా(Breast) ఉంటుంది, వాటిని దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. , అసౌకర్యం, నొప్పిని తగ్గిస్తుంది. శరీరానికి మరింత ఆకర్షణీయమైన ఆకృతిని ఇస్తుంది. రొమ్ములను ఆకర్షణీయంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి. నొప్పి, అసౌకర్యం లేకుండా స్వేచ్ఛగా, సౌకర్యవంతంగా వెళ్లేందుకు సహాయపడతాయి. సాఫ్ట్ క్లాత్(Soft fabric) ఉన్న బ్రాలను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే బిగుతుగా ఉండే బ్రాలు చర్మంపై, ముఖ్యంగా రొమ్ములు, భుజాలు, వెనుక భాగంలో అవాంఛిత గుర్తులు(Scars) ఏర్పడుతాయి. బ్రా చాలా చిన్నగా ఉన్నప్పుడు, అది చర్మంలో చొచ్చుకొని అసౌకర్యం, దురద, చికాకు కలిగే అవకాశం ఉంటుంది. చాలా బిగుతుగా ఉండే బ్రా ధరించడం వల్ల రొమ్ములలో రక్త ప్రసరణకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించడానికి అతిగా బిగుతుగా ఉండే బ్రాలను ధరించడం సరికాదని, శరీర ఆకృతికి తగ్గట్టుగా సరిగా సరిపోయే వాటిని ఎంచుకోవాలంటున్నారు. బ్రా ధరించాలనే నిర్ణయం సౌకర్యం, ఆరోగ్య అవసరాలపై ఆధారపడి ఉండాలి. శరీరానికి ఏది బాగుంటుందో దానిని వాడాలని సూచిస్తున్నారు.