మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మీరు దీన్ని వివిధ ప్రదేశాలలో నినాదాల రూపంలో చూస్తూనే ఉంటారు . ఎక్కువ ఆల్కహాల్(alcohol) తాగడం వల్ల కాలేయం దెబ్బతినడం అలాగే ఇతర వ్యాధుల రావడానికి ఆస్కారం ఉంటుంది . అయితే ఈ మద్యానికి సంబంధించి మరో నిజం కూడా ఉంది.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మీరు దీన్ని వివిధ ప్రదేశాలలో నినాదాల రూపంలో చూస్తూనే ఉంటారు . ఎక్కువ ఆల్కహాల్(alcohol) తాగడం వల్ల కాలేయం దెబ్బతినడం అలాగే ఇతర వ్యాధుల రావడానికి ఆస్కారం ఉంటుంది . అయితే ఈ మద్యానికి సంబంధించి మరో నిజం కూడా ఉంది. గర్భిణీ స్త్రీలు (pregnant)ఈ మద్యాన్ని తీసుకుంటే, తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఎదుర్కుంటారు . గర్భిణీ స్త్రీలకు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

తల్లి మద్యం సేవించడం వల్ల పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక అధ్యయనం జరిగింది. గర్భధారణ (pregnancy)సమయంలో ఎక్కువ లేదా తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పిల్లల మెదడు నిర్మాణం లోఅనుకోని మార్పులు సంభవిస్తాయని MRI అధ్యయనం వెల్లడించింది. దీంతో పిల్లల మెదడు ఎదుగుదల సరిగా జరగదు . అలాంటప్పుడు , పిల్లలలో మానసిక ఎదుగుదల లేకపోవడం , మాటలు సరిగ్గా రాకపోవటం , ప్రవర్తన సమస్యలు, వంటివి ఉంటాయి . దీనినే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్( fetal alcohol syndrome)అంటారు.

ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (fetal alcohol syndrome)అంటే ఏమిటి?
గర్భిణిగా (pregnant)ఉన్నప్పుడు మహిళలు ఆల్కహాల్ కు చాలా దూరంగా ఉండాలి. కానీ కొంతమంది మహిళలు గర్భధారణ సమయంలో తాగడం మానేయరు. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తాగిన తర్వాత, అది ప్లాసెంటా ద్వారా పిండానికి చేరుతుంది. పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల, పిండం ఆల్కహాల్‌ను (Alcohol)జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండదు. ఈ ఆల్కహాల్ గర్భంలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. పిల్లల మానసిక అభివృద్ధిని ఇది అడ్డుకోవడం మొదలవుతుంది . దీనినే ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ (FAS) అంటారు. ఈ సమస్యలు ప్రసవం తరువాత కూడా సరిచేయబడవు .

FAS తర్వాత, పిల్లలలో అనేక శారీరక సమస్యలు కూడా కనిపిస్తాయి. ఇందులో బరువు తగ్గడం, ఎదుగుదల తగ్గడం, పిల్లల ముఖకవళికల్లో అనేక సమస్యలు కనిపిస్తాయి. ఉదాహరణకు, చిన్న కళ్ళు, పైకి తిరిగిన ముక్కు, సన్నని పై పెదవి, ముక్కు ఇంకా పై పెదవుల మధ్య సన్నని చర్మం ఉన్నాయి. మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల దాని పరిమాణం చిన్నదిగా మారుతుంది.

Updated On 18 April 2023 6:14 AM GMT
rj sanju

rj sanju

Next Story